Share News

Viral: వధువు కోసం ఇతడి వెతుకులాట మామూలుగా లేదుగా.. రిక్షాపై బయోడేటా రాసి మరీ..

ABN , Publish Date - Feb 20 , 2024 | 09:46 PM

ప్రతి ఒక్కరి జీవితాన్నీ పెళ్లికి ముందు, తర్వాత అని లెక్కకట్టవచ్చు. అప్పటిదాకా ఒంటరిగా ఉన్న వారు కాస్తా.. వివాహ బంధంతో జంటగా మారతారు. జీవితాంతం అదే బంధాన్ని కొనసాగిస్తారు. అందుకే...

Viral: వధువు కోసం ఇతడి వెతుకులాట మామూలుగా లేదుగా.. రిక్షాపై బయోడేటా రాసి మరీ..

ప్రతి ఒక్కరి జీవితాన్నీ పెళ్లికి ముందు, తర్వాత అని లెక్కకట్టవచ్చు. అప్పటిదాకా ఒంటరిగా ఉన్న వారు కాస్తా.. వివాహ బంధంతో జంటగా మారతారు. జీవితాంతం అదే బంధాన్ని కొనసాగిస్తారు. అందుకే అందరి జీవితంలో పెళ్లికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొందరి విషయంలో వివాహం చాలా తొందరగా జరిగితే.. మరికొందరి విషయంలో చాలా ఆలస్యం అవుతుంటుంది. ఈ క్రమంలో చాలా మంది పెళ్లి ప్రయత్నాలు చిత్రవిచిత్రంగా చేస్తుంటారు. కొందరు తమకు తెలిసిన మ్యారేజ్ బ్రోకర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తే.. మరికొందరు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. వధువు కోసం వింత ప్రచారం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) దామోహ్‌ అనే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల దీపేంద్ర రాథోడ్ అనే యువకుడు ఈ-రిక్షా (E-rickshaw) నడుపుతుంటాడు. రిక్షా నడుపుతున్న కారణంగా పెళ్లి సంబంధాలు రావడం లేదో.. లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో ఏమో గానీ.. ఎవరూ ఇతడికి పిల్లను ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అతడి అన్న, చెల్లెలికి వివాహాలు జరిగాయి. కానీ ఇతడికి మాత్రం అమ్మాయి దొరకడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు రాథోడ్‌కు విచిత్రమైన ఐడియా వచ్చింది.

Viral Video: ప్రియురాలితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడతాడనుకుంటే.. వామ్మో!.. ఇతనేంటీ చివరకు ఇలా చేశాడు..

తన పేరు, పుట్టిన తేదీ, సమయం, విద్యార్హతలు, బ్లడ్ గ్రూప్, గోత్రం తదితరాల వివరాలను పొందుపరుస్తూ ఫొటో కూడా ముద్రించి.. పెద్ద బయోడాటా (Biodata) తయారు చేశాడు. తనకు ఏప్రాంతం వారైనా, ఏ కులం వారైనా పర్లేదని అందులో తెలియజేశాడు. చివరగా దాన్ని ఆటోకి అంటించాడు. ఈ వాహనం రోడ్ల పైకి రాగానే అంతా విచిత్రంగా చూస్తున్నారు. కాగా, ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి నిజాయితీ బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘వావ్! మీ ఆలోచన సూపర్’’.. అంటూ మరికొందరు, ‘‘మీకు త్వరగా వివాహం కావాలని కోరుకుంటున్నాం’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ..! ఉజాలాతో సరికొత్త ప్రయోగం.. చివరికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందంటే..

Updated Date - Feb 20 , 2024 | 09:46 PM