Share News

Viral Video: పట్టుదల అంటే ఎలా ఉండాలో చూపించిన బుల్లి ఏనుగు.. ఎవరిసాయం లేకుండానే..

ABN , Publish Date - Feb 21 , 2024 | 09:29 PM

కొందరు లక్ష్యాలను నేరవేర్చుకునే క్రమంలో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.. కానీ మధ్యలో ఉన్నట్టుండి నిరాశకు లోనై ప్రయత్నాలను అర్ధాంతరంగా ఆపేస్తుంటారు. చిన్న చిన్న అవాంతరాలకే భయపడి వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి....

Viral Video: పట్టుదల అంటే ఎలా ఉండాలో చూపించిన బుల్లి ఏనుగు.. ఎవరిసాయం లేకుండానే..

కొందరు లక్ష్యాలను నేరవేర్చుకునే క్రమంలో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.. కానీ మధ్యలో ఉన్నట్టుండి నిరాశకు లోనై ప్రయత్నాలను అర్ధాంతరంగా ఆపేస్తుంటారు. చిన్న చిన్న అవాంతరాలకే భయపడి వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు మన చుట్టూ జరిగే అనేక సంఘటనలకు ఎంతో ప్రేరణ కలిగిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఏనుగు వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. పట్టుదల అంటే ఎలా ఉండాలో ఓ ఏనుగు పిల్ల చేసి చూపించింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని ఏనుగులు అడవిలో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్తుంటాయి. మార్గ మధ్యలో ఓ పెద్ద మట్టి గడ్డ ఎక్కాల్సి వస్తుంది. పెద్ద ఏనుగులు ఈజీగా పైకి ఎక్కే్స్తాయి. అయితే వాటిలో ఓ బుల్లి ఏనుగు (baby elephant) పైకి ఎక్కేందుకు తీవ్రంగా కష్టపడుతుంది. అయినా దాని వల్ల సాధ్యం కాదు. ఎలాగోలా ఎక్కే ప్రయత్నం చేస్తుండగా.. అక్కడే ఉన్న పెద్ద ఏనుగు దాన్ని పక్కకు తోసేస్తుంది. దీంతో ఎలాగైనా దాన్ని దాటుకుని వెళ్లాలనే ఉద్దేశంతో మరో వైపు వెళ్లి ప్రయత్నిస్తుంది. అక్కడున్న మరో పెద్ద ఏనుగు కూడా దానికి ఎలాంటి సాయం చేయదు.

Viral Video: అరెరే..! అనవసరంగా భార్యతో పెట్టుకున్నాడే.. చివరకు ఈ భర్త పరిస్థితి ఏమైందో చూస్తే..

అయితే అక్కడ తీవ్రంగా ప్రయత్నించినా కూడా గడ్డ పైకి ఎక్కడం సాధ్యం కాదు. అయినా నిరాశ చెందకుండా ‘‘దీన్ని ఎలాగైనా దాటుకుని వెళ్లి చూపిస్తా’’.. అనుకుని చివరగా తేరిపారా చూసి దూరంగా వెళ్తుంది. గడ్డ ఎత్తు తక్కువగా ఉన్న చోటు చూసుకుని ఈజీగా పైకి ఎక్కేసి ఏనుగుల సమూహం వద్దకు వెళ్లిపోతుంది. ఈ విధంగా ఆ బుల్లి ఏనుగు ఎలాంటి సాయం లేకుండా ముందుకు వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగు పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘పట్టుదల అంటే ఇలా ఉండాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ ఏనుగును చూసి.. మనుషులు చాలా నేర్చుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నిధి కోసం వెతుకుండగా బయటపడిన బంగారు ఉంగరాలు.. వాటి కింద ఏముందో అని చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - Feb 21 , 2024 | 09:29 PM