Share News

Viral Video: అరెరే..! అనవసరంగా భార్యతో పెట్టుకున్నాడే.. చివరకు ఈ భర్త పరిస్థితి ఏమైందో చూస్తే..

ABN , Publish Date - Feb 21 , 2024 | 07:43 PM

భార్యాభర్తల మధ్య నిత్యం అనేక రకాల గొడవలు జరగడం సర్వసాధారణం. అయితే ఎలాంటి గొడవలు జరిగినా కాసేపటికే మళ్లీ సర్దుకుపోతుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం ఇవి చాలా సీరియస్ అవుతుంటాయి. ప్రస్తుతం..

Viral Video: అరెరే..! అనవసరంగా భార్యతో పెట్టుకున్నాడే.. చివరకు ఈ భర్త పరిస్థితి ఏమైందో చూస్తే..

భార్యాభర్తల మధ్య నిత్యం అనేక రకాల గొడవలు జరగడం సర్వసాధారణం. అయితే ఎలాంటి గొడవలు జరిగినా కాసేపటికే మళ్లీ సర్దుకుపోతుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం ఇవి చాలా సీరియస్ అవుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో ఇలాంటి గొడవలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బైకుపై వెళ్తున్న భార్యాభర్తల మధ్య ఉన్నట్టుండి అనుకోని గొడవ. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి బైకుపై వెళ్తుండగా... మార్గమధ్యలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఉన్నట్టుండి దంపతల (Quarrel between husband and wife) మధ్య గొడవ మొదలవుతుంది. దీంతో అతను బైకును రోడ్డు పక్కన నిలిపేస్తాడు. బైకు నుంచి కిందకు దిగీ దిగగానే భార్య ఒక్కసారిగా రెచ్చిపోతుంది. ఎదురుగా ఉన్న భర్తను కాలితో ఒక్క తన్ను తన్నుతుంది. దెబ్బకు అతను ఎగిరి పక్కన పడతాడు. భార్య చేసిన పనికి కోపంతో పైకి లేచి, ఆమెపై తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమె.. అతను కొట్టుకుంటూ కొట్టుకుంటూ రోడ్డు పక్కకు వెళ్తుంది.

Viral Video: ఈ యువతి ఐడియా అదుర్స్..! పేరుకుపోయిన మంచు గడ్డలతో నోరూరించే రెసిపీ..

తర్వాత ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ పక్కనే ఉన్న కాలువలో పడిపోతారు. నీళ్లలో పడిపోయినా కూడా అలాగే గొడవపడుతూనే ఉంటారు. అప్పటికీ శాంతించని భార్య.. భర్తను మురుగు నీటిలో ముంచి చితక్కొడుతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె ఆవేశం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘రీల్స్ కోసం యాక్షన్ బాగానే చేశారు’’.. అంటూ మరికొందరు, ‘‘ఏది నిజమో ఏది ప్రాంకో.. అర్థం కావడం లేదు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆహా.. ఏం వాడకమయ్యా..! ఇన్నాళ్లూ వాషింగ్ మెషిన్‌ అంటే దుస్తులు ఉతికేందుకే అనుకున్నాం.. కానీ..

Updated Date - Feb 21 , 2024 | 07:43 PM