Share News

Viral Video: ఇలాంటి కుక్క ఒక్కటి ఉన్నా చాలు.. పిల్లాడిని ఎలా కాపాడుతుందో చూస్తే..

ABN , Publish Date - Feb 22 , 2024 | 02:57 PM

కుక్కలకు ఉన్న విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన కళ్ల ముందు నిత్యం చోటు చేసుకునే అనేక ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. కొన్ని కుక్కలైతే ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటాయి. మరికొన్ని...

Viral Video: ఇలాంటి కుక్క ఒక్కటి ఉన్నా చాలు.. పిల్లాడిని ఎలా కాపాడుతుందో చూస్తే..

కుక్కలకు ఉన్న విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన కళ్ల ముందు నిత్యం చోటు చేసుకునే అనేక ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. కొన్ని కుక్కలైతే ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటాయి. మరికొన్ని కుక్కలు మనుషులకే గుణపాఠాలు నేర్పుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ కుక్క పిల్లాడికి కాపాలాగా ఉంటూ.. ప్రమాదం నుంచి తెలివిగా రక్షించడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు పెద్ద పరీక్ష పెడతాడు. తన పిల్లాడిని కుక్క ఎలా రక్షిస్తుందో ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటాడు. ఇందుకోసం ఇంట్లో ఎవరూ లేని సమయంలో జోగాడుతున్న పిల్లాడిని ఇంట్లోని హాల్లో వదిలి కెమెరా ఆన్ చేస్తాడు. పిల్లాడు జోగాడుతూ ఇంటి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. అక్కడే పడుకుని ఉన్న కుక్క.. పిల్లాడిని గమనించి వేగంగా అతడి వద్దకు వెళ్లి బయటకు వెళ్లకుండా ఆపుతుంది. అయినా పిల్లాడు మాత్రం బయటికి వెళ్లేందుకే ప్రయత్నిస్తాడు. దీంతో బుడ్డోడి కంటే ముందే (dog saved the child) తలుపు వద్దకు వెళ్లి అడ్డుగా పడుకుంటుంది.

Viral Video: పట్టుదల అంటే ఎలా ఉండాలో చూపించిన బుల్లి ఏనుగు.. ఎవరిసాయం లేకుండానే..

అయినా పిల్లాడు జోగాడుతూ మెల్లగా తలుపు వద్ద నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో కుక్క పిల్లాడికి ఎదురుగా వెళ్లి తలను అడ్డు పెట్టి అడ్డుకుంటుంది. చివరకు బాలుడు ఇంట్లోకి వెళ్లిపోతాడు. అతను లోపలికి వెళ్లేవరకూ కుక్క వెనుకే వస్తూ మెల్లిగా ముందుకు నెడుతూనే ఉంటుంది. ఇలా పిల్లాడు తలుపు మెట్ల వద్ద నుంచి కింద పడకుండా కాపాడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి కుక్క ఒక్కటి ఉంటే చాలు’’.. అంటూ కొందరు, ‘‘వావ్!.. ఈ కుక్క నిజంగా ఎంతో గ్రేట్’’.. అంటూ మరికొందరు, ‘‘కుక్కల విశ్వాసం అంటే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నిధి కోసం వెతుకుండగా బయటపడిన బంగారు ఉంగరాలు.. వాటి కింద ఏముందో అని చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - Feb 22 , 2024 | 02:57 PM