Share News

Viral News: మహిళా టీచర్ వింత నిర్వాకం.. విద్యార్థులను ఆలయానికి తీసుకెళ్లి మరీ.. చివరకు..

ABN , Publish Date - Feb 24 , 2024 | 04:23 PM

విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటూ సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాల్సిన ఉపాధ్యాయులు కొందరు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించి, అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. కొన్నిసార్లు..

Viral News: మహిళా టీచర్ వింత నిర్వాకం.. విద్యార్థులను ఆలయానికి తీసుకెళ్లి మరీ.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటూ సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాల్సిన ఉపాధ్యాయులు కొందరు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించి, అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. కొన్నిసార్లు వీరి ప్రవర్తన చూస్తే సభ్యసమాజం మొత్తం సిగ్గుపడేలా ఉంటుంది. ఇలాంటి అమానవీయ ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వార్త ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. పాఠశాలలో విద్యార్థులపై అనుమానంతో ఓ టీచర్ వింత నిర్వాకానికి పాల్పడింది. అందరినీ ఆలయానికి తీసుకెళ్లి మరీ.. ఆమె చేసిన పని తెలుసుకుని విద్యార్థుల తల్లిందండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. బీహార్ (Bihar) బంకా జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రాజౌన్ బ్లాక్‌లోని అస్మానిచక్ గ్రామంలోని పాఠశాలలో సుమారు 122మంది విద్యార్థులు నిద్యనభ్యసిస్తున్నారు. కాగా, ఈ పాఠశాలలో బుధవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉపాధ్యాయురాలిగా పని చేసే నీతూ కుమారి అనే టీచర్ (Teacher) .. బుధవారం తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులను పిలిచి వాటర్ బాటిల్ కొన్నుక్కురావాలని పంపించింది. అయితే ఆ తర్వాత ఆమె తన పర్సు పరిశీలించగా.. అందులో రూ.35లు కనిపించలేదు.

Viral Video: వంటగదిలోకి మొదటిసారి అడుగుపెట్టిన మోడ్రన్ కోడలు.. స్టవ్ వెలిగించగానే..

తన డబ్బులు విద్యార్థులే తీశారని అనుమానం పెంచుకుంది. అందరినీ పిలిచి.. ‘‘నా పర్సులో డబ్బులు ఎవరు తీశారో చెప్పండి’’.. అని ప్రశ్నించింది. అయితే తాము ఎవరమూ డబ్బులు తీయలేదంటూ విద్యార్థులు చెప్పారు. అప్పటికీ శాంతించని టీచర్.. వారిని ఏకంగా స్థానిక ఆలయానికి తీసుకెళ్లి, ప్రమాణం కూడా చేయించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. గురువారం పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేశారు. రూ.35లు కోసం తమ పిల్లలను టీచర్ అవమానించిందని, ఆమెపై చర్యలు తీసుకునే వరకూ పాఠశాలను తెరవనిమ్మమని భీష్మించుకున్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల వరకూ వెళ్లడంతో.. సదరు టీచర్‌ను సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై టీచర్ మాట్లాడుతూ.. తాను విద్యార్థులతో ప్రమాణం చేయించలేదని, కేవలం డబ్బులు ఎవరు తీశారు.. అని మాత్రమే అడిగానని చెప్పారు. కాగా, ఈ ఘటన చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: కూతురిపై అనుమానం వచ్చి మేడపైకి వెళ్లిన తల్లి.. మొత్తం వెతికి చూడగా.. చివరకు పక్క గదిలో..

Updated Date - Feb 24 , 2024 | 04:23 PM