Share News

Viral Video: మెడలోని పాము ఉన్నట్టుండి కాటేయడంతో.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ పెద్దాయన చేసిన పని..

ABN , Publish Date - Feb 22 , 2024 | 06:20 PM

పాములతో పరాచకాలు ఆడుతూ కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు పాములను ఆడిస్తూ పొట్టపోసుకుంటుంటారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ...

Viral Video: మెడలోని పాము ఉన్నట్టుండి కాటేయడంతో.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ పెద్దాయన చేసిన పని..

పాములతో పరాచకాలు ఆడుతూ కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు పాములను ఆడిస్తూ పొట్టపోసుకుంటుంటారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఎంత అనుభవం ఉన్న వారైనా కొన్నిసార్లు ఏమరపాటు కారణంగా ప్రమాదాల బారిన పడడం చూస్తూ ఉంటాం. తాజాగా, ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పెద్దాయన పామును మెడలో వేసుకోగా.. అనుకోని విధంగా కాటు వేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాములు ఆడించే ఓ వ్యక్తి.. నాగుపామును మెడలో వేసుకుని అందరికీ ఏదో వివరిస్తుంటాడు. పాము తోక పట్టుకున్న వ్యక్తి తలను వదిలేసి ఎదురుగా ఉన్న వారికి ఏదో చెబుతుండగా.. మధ్యలో పాము ఉన్నట్టుండి (snake bit an old man) అతడి చేతిపై కాటు వేస్తుంది. దీంతో ఒక్కసారిగా అతను షాక్ అవుతాడు. వెంటనే పాము తలను పట్టుకుని పక్కకు లాగేస్తాడు. తర్వాత పాము తల తెరచి దాని కోరలను తొలగించే ప్రయత్నం చేస్తాడు. చివరగా తన ప్రాణాలు కాపాడుకునేందుకు పక్కనే ఉన్న వారి సాయం తీసుకుంటాడు.

Viral Video: మందుబాబులను కట్టిపడేస్తున్న ఆటో.. ఈ డ్రైవర్ ఏర్పాట్లు మామూలుగా లేవుగా..

ఓ యువకుడు అక్కడికి వచ్చి వృద్ధుడి చేతిపై బట్టతో గట్టిగా బిగించి కట్టేస్తాడు. తర్వాత ఆ వృద్ధుడు పాము విషయం బయటకు తీసేందుకు బ్లేడుతో తన చేతిపై చాలా చోట్ల కాట్లు వేసి రక్తం బయటకు తీస్తాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాముల విషయంలో అజాగ్రత్తగా ఉండడం ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘ఈ పెద్దాయన అనవసరంగా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడే’’.. అంటూ మరికొందరు, ‘‘పాము కాటు వేయగానే.. వైద్యులను సంప్రదిచాలి గానీ.. ఇలాంటి పనులు చేయడం ప్రమాదం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎత్తైన భవనంపై ప్రేమ జంట వింత నిర్వాకం.. ప్రేయసిని గాల్లో వేలాడదీసి మరీ..

నోట్: ఇది కేవలం వైరల్ కంటెంట్ మాత్రమే. వీడియోలోని చూసిన కంటెంట్‌ని అనుకరించకండి.

Updated Date - Feb 22 , 2024 | 06:29 PM