Share News

Viral Video: ఎత్తైన భవనంపై ప్రేమ జంట వింత నిర్వాకం.. ప్రేయసిని గాల్లో వేలాడదీసి మరీ..

ABN , Publish Date - Feb 22 , 2024 | 05:43 PM

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు ప్రాణాలకు తెగించి మరీ సామసాలు చేయడం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కొందరు జంతువులతో పరాచకాలు ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే..

Viral Video: ఎత్తైన భవనంపై ప్రేమ జంట వింత నిర్వాకం.. ప్రేయసిని గాల్లో వేలాడదీసి మరీ..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు ప్రాణాలకు తెగించి మరీ సామసాలు చేయడం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కొందరు జంతువులతో పరాచకాలు ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే.. మరికొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎత్తైన భవనంపై చివరన నిలబడి ఓ ప్రేమ జంట చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వందల అడుగుల ఎత్తైన భవనంపై ఓ ప్రేమ జంట (love couple strange stunt on tall building) వింత విన్యాసానికి సిద్ధపడింది. భవనం పైభాగంలో చివరన ఓ ఇనుప స్తంభంపై నిలబడ్డ అతను.. తన ప్రియురాలిని ఏకంగా పైనుంచి కిందకు వేలాడుదీశాడు. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా.. ఆమెను చేత్తో పట్టుకుని కిందకు వేలాడదీశాడు. ఇలా కొద్ది సేపు పట్టుకున్న తర్వాత మళ్లీ ఆమెను పైకి తీసుకుంటాడు.

Viral Video: ఇలాంటి కుక్క ఒక్కటి ఉన్నా చాలు.. పిల్లాడిని ఎలా కాపాడుతుందో చూస్తే..

తర్వాత ఇద్దరూ ఆ స్తంభంపై ప్రమాదకర స్థితిలో నిలబడి అలాగే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఏమాత్రం అదుపుతప్పినా పైనుంచి కిందపడిపోయే ప్రమాదం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ప్రేమ జంట పిచ్చి పీక్స్‌కు వెళ్లింది’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో!.. ఇదెక్కడి విన్యాసం రా నాయనా’’.. అంటూ మరికొందరు, ‘‘వ్యూస్ కోసం ఇలాంటి సాహాసాలు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మందుబాబులను కట్టిపడేస్తున్న ఆటో.. ఈ డ్రైవర్ ఏర్పాట్లు మామూలుగా లేవుగా..

Updated Date - Feb 22 , 2024 | 05:44 PM