Share News

Viral Video: ఆశ్చర్యం..! పిల్లాడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన పిల్లి.. చివరికి..

ABN , Publish Date - Feb 22 , 2024 | 08:10 PM

కుక్కలు, కోతులు, పిల్లలు అప్పడప్పుడూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించండం చూస్తుంటాం. కొన్నిసార్లు అవి మనుషుల్లాగా అనుకరించడం చూస్తూనే ఉంటాం. కానీ మనుషులను కాపాడేందుకు...

Viral Video: ఆశ్చర్యం..! పిల్లాడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన పిల్లి.. చివరికి..

కుక్కలు, కోతులు, పిల్లలు అప్పడప్పుడూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించండం చూస్తుంటాం. కొన్నిసార్లు అవి మనుషుల్లాగా అనుకరించడం చూస్తూనే ఉంటాం. కానీ మనుషులను కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందులోనూ పిల్లులు ఇలాంటి త్యాగానికి పూనుకోవడం ఇంకా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పిల్లాడిపై కుక్క దాడి చేయడాన్ని గమనించిన పిల్లి.. కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు తమ ఇంటికి ఎదురుగా గోడ పక్కన నిలబడి ఆడుకుంటూ ఉంటాడు. అదే సమయంలో అటుగా ఓ వీధి కుక్క వస్తుంది. బాలుడిని చూడగానే దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. వేగంగా అతడి వద్దకు వెళ్లి కరిచే ప్రయత్నం చేస్తుంది. కుక్క దాడి చేయడంతో భయపడిపోయిన బాలుడు గట్టిగా ఏడుస్తాడు. ఈ క్రమంలో కింద పడ్డ బాలుడిని కుక్క దాడి చేయబోతుంది. ఇదంతా దూరం నుంచి గమనించిన పిల్లి.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా (cat tried to save the child) కుక్క మీదకు ఉరుకుతుంది. కుక్కను వెనుక నుంచి కరుస్తుంది.

Viral Video: ఎత్తైన భవనంపై ప్రేమ జంట వింత నిర్వాకం.. ప్రేయసిని గాల్లో వేలాడదీసి మరీ..

దెబ్బకు కుక్క బాలుడిని వదిలి పిల్లి పైకి దూకుతుంది. అంతలో బాలుడి తల్లి అక్కడికి వచ్చి పిల్లాడిని రక్షిస్తుంది. మరో వైపు పిల్లి.. కుక్కకు దొరక్కుండా అక్కడి నుంచి పారిపోతుంది. దీంతో చివరకు కుక్క అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ పిల్లి... పిల్లాడి పాలిట దేవుడిలా వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘పిల్లికి ఉన్న మంచి మనసు.. మనుషుల్లో కరువవుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మెడలోని పాము ఉన్నట్టుండి కాటేయడంతో.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ పెద్దాయన చేసిన పని..

Updated Date - Feb 22 , 2024 | 08:10 PM