Share News

Viral Video: కూతురిపై అనుమానం వచ్చి మేడపైకి వెళ్లిన తల్లి.. మొత్తం వెతికి చూడగా.. చివరకు పక్క గదిలో..

ABN , Publish Date - Feb 23 , 2024 | 09:47 PM

ప్రేమికులు నిత్యం వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరు ఇంట్లో వారికి తెలీకుండా ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటారు. అయితే ఆనోటా ఈనోటా పడి చివరకు ఏదో ఒక రోజు తల్లిదండ్రులకు తెలిసిపోతుంటుంది. అలాగే...

Viral Video: కూతురిపై అనుమానం వచ్చి మేడపైకి వెళ్లిన తల్లి.. మొత్తం వెతికి చూడగా.. చివరకు పక్క గదిలో..

ప్రేమికులు నిత్యం వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరు ఇంట్లో వారికి తెలీకుండా ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటారు. అయితే ఆనోటా ఈనోటా పడి చివరకు ఏదో ఒక రోజు తల్లిదండ్రులకు తెలిసిపోతుంటుంది. అలాగే ఇంకొందరు ప్రేమికులు కుటుంబ సభ్యులకు తెలీకుండా తమ ఇళ్లల్లోనూ కలుస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కూతురిపై అనుమానం వచ్చిన తల్లి మేడ పైకి వెళ్లింది. మొత్తం వెతకగా చివరకు పక్క గదిలో షాకింగ్ సీన్ కనిపించింది. చివరకు ఏం జరిగిందంటే...

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ప్రేమికుల రోజు (Valentine's Day) తన ప్రియురాలిని కలుద్దామని అనుకున్నాడు. ఇదే విషయాన్ని తన ప్రేయసితో చెప్పాడు. అయితే తన కుటుంబ సభ్యులు ఉండడంతో అది సాధ్యం కాలేదు. కానీ ఇద్దరూ ఎలాగైనా కలుద్దామని ఫిక్స్ అయ్యారు. చివరకు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ప్రియురాలి ఇంటికే వెళ్లాడు. మేడ పైన ఇద్దరూ కలిసి ఉండగా.. చుట్టు పక్కల వారు చూసి యువతి తల్లికి సమాచారం అందించారు. అప్పటికే యువతి తన ప్రియుడిని ఓ గదిలో దాచి పెట్టింది. కాసేపటికి అక్కడికి చేరుకున్న ఆమె.. కంగారుగా మేడ పైకి వెళ్లింది. పైన చూడగా ఎవరూ కనిపించలేదు. కానీ మొత్తం వెతకగా అటు పక్క గదిలో యువకుడు కనిపించడంతో షాక్ అయ్యింది.

Viral Video: వంటగదిలోకి మొదటిసారి అడుగుపెట్టిన మోడ్రన్ కోడలు.. స్టవ్ వెలిగించగానే..

యువకుడిని చూడగానే పట్టరాని కోపంతో బయటకు లాక్కొచ్చింది. చెప్పు తీసుకుని ( mother slapped her daughter's boyfriend) అతన్ని ఎడాపెడా బాదేసింది. దీంతో అతను చివరకు తప్పించుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. అప్పటికే శాంతించని తల్లి.. తన కూతురిని కూడా చెప్పుతో కొట్టి.. ‘‘ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే చంపేస్తా’’.. అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటన మొత్తం పక్కింటి వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‪‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీరికి ఈ ప్రేమికుల రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’.. అంటూ కొందరు, ‘‘లైక్‌లు, వ్యూస్ కోసమే ఇలా చేసినట్టుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Guinness World Records: ముక్కులో గుత్తులుగా అగ్గిపుల్లలు.. ఇతడి రికార్డ్ గురించి తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Feb 23 , 2024 | 09:49 PM