Share News

Viral Video: ఎలా వస్తాయయ్యా.. ఇలాంటి ఐడియాలు.. ! గర్ల్‌ఫ్రెండ్ లేకపోవడంతో ఇతడు చేసిన నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Feb 23 , 2024 | 08:01 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తూ.. ఏదో రకంగా నెటిజన్ల దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఇంకొందరు..

Viral Video: ఎలా వస్తాయయ్యా.. ఇలాంటి ఐడియాలు.. ! గర్ల్‌ఫ్రెండ్ లేకపోవడంతో ఇతడు చేసిన నిర్వాకం చూడండి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తూ.. ఏదో రకంగా నెటిజన్ల దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఇంకొందరు ప్రాంక్ పేరుతో ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. వాటిలో కొన్ని నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు ఇటీవల నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గర్ల్‌ఫ్రెండ్ లేదనే ఉద్దేశంతో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. చివరకు అతడి నిర్వాకం చూసి అంతా పగలబడి నవ్వుకున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ప్రేయసిని బైకుపై తీసుకెళ్లడం సర్వసాధారణం. అయితే గర్ల్‌ఫ్రెండ్ లేని వారు ఏం చేస్తారు.. అని అడిగితే సింగల్ జర్నీ తప్ప ఏమీ చేయలేరని చెబుతాం. కానీ ఓ యువకుడు ఇదే విషయంపై కాస్త విచిత్రంగా ఆలోచించాడు. గర్ల్‌ఫ్రెండ్ లేకపోవడంతో ఓ బొమ్మకు డ్రస్ వేసి, అందంగా అలంకరించాడు. తర్వాత తన బైకు వెనుక (man carrying doll girl on bike) కూర్చోబెట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు.

Cyber Crime: మీ ఫొటోలపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. ప్రణవ్, త్రిష.. థ్రిల్లింగ్ ఎపిసోడ్‌లో ట్విస్టులే.. ట్విస్టులు..

అతన్ని చూడగానే ముందుగా ఎవరికీ ఎలాంటి సందేహం రాలేదు. అయితే కాస్త తీక్షణంగా పరిశీలించి.. చివరకు అంతా పగలబడి నవ్వుకున్నారు. అక్కడే ఉన్న యువకులంతా బైకు చుట్టూ చేరి నవ్వుకున్నారు. ఆటోల్లో వెళ్తున్న మహిళలు.. ఇతడి నిర్వాకం చూసి సిగ్గుతో తల పక్కకు తిప్పుకొని మరీ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వాటెన్ ఐడియా సర్జీ’’.. అంటూ కొందరు, ‘‘ఈ జంట చాలా బాగుంది బ్రదర్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి ప్రయాణం ఎప్పుడైనా చూశారా.. రైలు ఎంత రద్దీగా ఉంటే మాత్రం.. మరీ ఇదేంటీ భయ్యా..!

Updated Date - Feb 23 , 2024 | 08:01 PM