Share News

Viral Video: ఇలాంటి ప్రయాణం ఎప్పుడైనా చూశారా.. రైలు ఎంత రద్దీగా ఉంటే మాత్రం.. మరీ ఇదేంటి భయ్యా..!

ABN , Publish Date - Feb 22 , 2024 | 08:50 PM

రైలు ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో.. అప్పుడప్పుడూ అంతే చిరాకుగా మారుతుంటుంది. కొన్నిసార్లు కనీసం కాలు మోపడానికి స్థలం లేనంత రద్దీగా ఉంటుంది. మరికొన్నిసార్లు..

Viral Video: ఇలాంటి ప్రయాణం ఎప్పుడైనా చూశారా.. రైలు ఎంత రద్దీగా ఉంటే మాత్రం.. మరీ ఇదేంటి భయ్యా..!

రైలు ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో.. అప్పుడప్పుడూ అంతే చిరాకుగా మారుతుంటుంది. కొన్నిసార్లు కనీసం కాలు మోపడానికి స్థలం లేనంత రద్దీగా ఉంటుంది. మరికొన్నిసార్లు బోగీ తలుపు వద్ద వేలాడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలా ప్రయాణించడం ప్రమాదకరమని తెలిసినా చాలా మంది పట్టించుకోరు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రద్దీగా ఉన్న రైల్లో కొందరి తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ రైలు అప్పటికే ప్రయాణికులతో రద్దీగా ఉంది. స్టేషన్‌లో ఆగగానే గుంపులుగా గుంపులుగా వెళ్లిన మరింత మంది ప్రయాణికులు అదే బోగీలోకి ఎక్కేశారు. అయితే ఆ బోగీ టాయిలెట్ (Train bogie toilet) కిటికీ అద్దం పూర్తిగా తీసి ఉండడంతో పాటూ అందులో పూర్తిగా లగేజీ ఉండడంతో పాటూ ముగ్గురు వ్యక్తులు కూడా ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. టాయిలెట్‌ను ఆక్రమించడం ఏంటి భయ్యా.. అని అక్కడున్న వారు ప్రశ్నించారు. దీనికి వారు ‘‘తప్పదు ఏం చేస్తాం’’.. అన్నట్లుగా సమాధానం ఇస్తారు.

Viral Video: మెడలోని పాము ఉన్నట్టుండి కాటేయడంతో.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ పెద్దాయన చేసిన పని..

బాత్రూంలో బ్యాగులను కుక్కేయడంతో పాటూ అదనంగా ముగ్గురు వ్యక్తులు కూడా ఇరుక్కుని ఉన్నారు. వారిలో ఓ వ్యక్తి కిటికీ బయటకు తల పెట్టి మరీ సేదతీరుతున్నాడు. వీరిని చూసి అక్కడున్న వారంతా ముక్కున వేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేందీ భయ్యా..! ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘బాత్రూంను కూడా ఆక్రమించారు కదరా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలా చేయడం వల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడతారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆశ్చర్యం..! పిల్లాడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన పిల్లి.. చివరికి..

Updated Date - Feb 22 , 2024 | 08:50 PM