Share News

Viral Video: వంటగదిలోకి మొదటిసారి అడుగుపెట్టిన మోడ్రన్ కోడలు.. స్టవ్ వెలిగించగానే..

ABN , Publish Date - Feb 23 , 2024 | 08:45 PM

ఒకప్పటి ఆడపిల్లలకు వివాహం చేసే లోపే వంటావార్పూ తెలిసి ఉండాలనేది నియమంగా ఉండేది. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అలాంటి పాత సాంప్రదాయాలకు స్వస్తి చెబుతున్నారు. ఏ ఫుడ్ కావాలన్నా...

Viral Video: వంటగదిలోకి మొదటిసారి అడుగుపెట్టిన మోడ్రన్ కోడలు.. స్టవ్ వెలిగించగానే..

ఒకప్పటి ఆడపిల్లలకు వివాహం చేసే లోపే వంటావార్పూ తెలిసి ఉండాలనేది నియమంగా ఉండేది. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అలాంటి పాత సాంప్రదాయాలకు స్వస్తి చెబుతున్నారు. ఏ ఫుడ్ కావాలన్నా ఇట్టే ఆన్‌లైన్ ఆర్డర్లు పెట్టేస్తున్నారు. అంతలా వంట చేయాలంటే.. ఫోన్‌లో వీడియోలు చూస్తూ చకచకా చేసి పడేస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అందులోనూ వంట గది అంటే తెలీని యువతులు.. అత్తింట్లో అడుగుపెట్టిన సందర్భాల్లో అనేక ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. కొత్త కోడలు మొదటిసారి వంటింట్లో అడుగుపెట్టింది. స్టవ్ వెలిగించగానే ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో (Funny viral video) తెగ వైరల్ అవుతోంది. కొత్తగా వివాహమైన ఓ యువతి.. అత్తారింట్లోని వంటింట్లోకి మొదటిసారి అడుగుపెట్టింది. వంట ఎలా చేయాలో కూడా తెలీని ఆమె (young woman tried to cook) ఎలాగోలా స్టవ్ వెలిగించింది. కడాయిలో నూనె తదితరాలు వేసి వంట చేయబోతుండగా.. ఉన్నట్టుండి కడాయి నుంచి చిటపటలు మొదలయ్యాయి. పాత్రలోని పదార్థాలన్నీ ఎగిరి మీద పడడంతో ఆమె భయంతో దూరంగా పరుగెత్తింది. స్టవ్ ఆపేందుకు ప్రయత్నించగా... అందులోని పదార్థాలు టప్.. టప్.. మని ఎగిరిపడుతుండడంతో సమీపానికి వెళ్లే ధైర్యం చేయలేకపోయింది.

Cyber Crime: మీ ఫొటోలపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. ప్రణవ్, త్రిష.. థ్రిల్లింగ్ ఎపిసోడ్‌లో ట్విస్టులే.. ట్విస్టులు..

చివరకు ఆమెకు ఓ హైటెక్ ఆలోచన వచ్చింది. ఇంకో గదిలోకి వెళ్లి ఓ హెల్మెట్ పెట్టుకుని వచ్చింది. చివరకు ఎలాగోలా స్టవ్‌ ఆఫ్ చేసి, కడాయిని ఎత్తేసి కొళ్లాయి వద్ద పెట్టేసింది. ఎట్టకేలకు సమస్య పరిష్కారం అవడంతో ఆమె.. హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు అన్నమాట’’.. అంటూ కొందరు, ‘‘మీ యాక్టింగ్ ఎంతో బాగుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయయ్యా.. ఇలాంటి ఐడియాలు.. ! గర్ల్‌ఫ్రెండ్ లేకపోవడంతో ఇతడు చేసిన నిర్వాకం చూడండి..

Updated Date - Feb 23 , 2024 | 08:45 PM