Share News

Elephant video: ఏనుగుతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటుంది మరి..

ABN , Publish Date - Feb 22 , 2024 | 09:43 PM

లైక్‌లు, వ్యూస్ కోసం వినూత్నంగా ఆలోచించాల్సింది పోయి.. కొందరు వికృత చేష్టలు చేస్తుంటారు. మరికొందరు ప్రశాంతంగా ఉన్న జంతువులను కెలికిమరీ చివరకు ఇబ్బందుల్లో పడుతుంటారు. ఏదో చేయాలని చూస్తే..

Elephant video: ఏనుగుతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటుంది మరి..

లైక్‌లు, వ్యూస్ కోసం వినూత్నంగా ఆలోచించాల్సింది పోయి.. కొందరు వికృత చేష్టలు చేస్తుంటారు. మరికొందరు ప్రశాంతంగా ఉన్న జంతువులను కెలికిమరీ చివరకు ఇబ్బందుల్లో పడుతుంటారు. ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో అవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రశాంతంగా మేత మేస్తున్న ఏనుగును ఓ యువతి అనవసరంగా కెలికింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. లైక్స్, వ్యూస్ కోసం ఓ యువతి ఏనుగుతో మంచి వీడియో తీయాలని ప్రయత్నిస్తుంది. చివరకు దూరంగా మేత మేస్తున్న ఏనుగును చూసి ఇదే మనకు కరెక్ట్ అని అనుకుంటుంది. కెమెరాకు ఫోజులు ఇస్తూ ఏనుగు (elephant) వద్దకు వెళ్తుంది. ఆ సమయలో ఏనుగు ప్రశాంతంగా మేత మేస్తూ ఉంటుంది. దాని సమీపానికి వెళ్లిన యువతి (young woman) .. దాన్ని విసిగించే ప్రయత్నం చేస్తుంది.

Viral Video: ఆశ్చర్యం..! పిల్లాడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన పిల్లి.. చివరికి..

యువతి విసిగించడంతో ఏనుగుకు ఒక్కసారిగా చిర్రెత్తుకొస్తుంది. ఆవేశంగా తల పైకి ఎత్తి, తొండంతో యువతిని బలంగా తోసేస్తుంది. దెబ్బకు ఆమె ఎగిరి పక్కన పడుతుంది. నేలకు బలంగా తాకడంతో గట్టిగా కేకలు పెడుతూ అక్కడి నుంచి పారిపోతుంది. ఈ ఘటనలో ఆమెకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ‘‘జంతువుల వద్ద పిచ్చి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి ప్రయాణం ఎప్పుడైనా చూశారా.. రైలు ఎంత రద్దీగా ఉంటే మాత్రం.. మరీ ఇదేంటీ భయ్యా..!

Updated Date - Feb 22 , 2024 | 09:43 PM