Share News

Viral Video: సైకిల్‌పై వెళ్తూనే వేడి వేడి టర్కిష్ కాఫీ తయారీ.. వామ్మో..! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:02 PM

ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరు రోజూ చేసే పనినే చిత్రవిచిత్రంగా చేస్తుంటారు. మరికొందరు ఒకే సమయంలో రెండు మూడు పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరు...

Viral Video: సైకిల్‌పై వెళ్తూనే వేడి వేడి టర్కిష్ కాఫీ తయారీ..  వామ్మో..! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరు రోజూ చేసే పనినే చిత్రవిచిత్రంగా చేస్తుంటారు. మరికొందరు ఒకే సమయంలో రెండు మూడు పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరు ఎవరికీ సాధ్యం కాని పనులను సైతం ఈజీగా చేసి పడేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌పై వెళ్తూనే వేడి వేడి టీ తయారు చేశాడు. ఇతడి టాలెంట్ చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సైకిల్ రైడ్‌కి (Cycle ride) వెళ్తాడు. అయితే సైకిల్‌పై వెళ్తూనే టీ కూడా చేసి చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతను సైకిల్ తొక్కడం స్టార్ట్ చేయగా.. హ్యాండిల్‌పై ఓ చెక్క బోర్డును ఏర్పాటు చేస్తాడు. దానిపై ఓ టవల్ ఉంచి దానిపై కాఫీ తయారీకి (Coffee making) సిద్ధంగా ఉంచుకున్న పొడవాటి కప్పును ఏర్పాటు చేశాడు. అందులో కాఫీ పొడి, నీళ్లు పోశాడు.

Viral Video: ఈమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. సమయానికి వచ్చి ఇతన్ని ఎలా కాపాడిందో చూడండి..

చివరగా ఓ చిన్న గ్యాస్ సిలిండర్ పెట్టి.. దానిపై కాఫీని వేడి చేస్తాడు. ఇలా ఫైనల్‌గా వేడి వేడి కాఫీని సిద్ధం చేస్తాడు. సిద్ధమైన కాఫీని ట్రేపై పెట్టి.. ఎదురుగా రోడ్డుపై నిల్చున్న వ్యక్తికి అందజేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సైకిల్‌పై కాఫీ తయారీ.. సూపర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అమ్మాయిలే సిగ్గుపడి పారిపోయేలా.. మెట్రో రైల్లో ఈమె చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Feb 28 , 2024 | 03:02 PM