Share News

Viral Video: అమ్మాయిలే సిగ్గుపడి పారిపోయేలా.. మెట్రో రైల్లో ఈమె చేసిన నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Feb 27 , 2024 | 09:42 PM

ప్రస్తుతం అబ్బాయిలతో పాటూ అమ్మాయిలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేయడం సర్వసాధారణమైపోయింది. చాలా మంది యువతులు ఓ అడుగు ముందుకేసి చిత్రవిచిత్రమైన పనులన్నీ చేస్తుంటారు. కొందరు..

Viral Video:  అమ్మాయిలే సిగ్గుపడి పారిపోయేలా.. మెట్రో రైల్లో ఈమె చేసిన నిర్వాకం చూస్తే..

ప్రస్తుతం అబ్బాయిలతో పాటూ అమ్మాయిలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేయడం సర్వసాధారణమైపోయింది. చాలా మంది యువతులు ఓ అడుగు ముందుకేసి చిత్రవిచిత్రమైన పనులన్నీ చేస్తుంటారు. కొందరు జంతువులతో పరాచకాలు ఆడుతూ ప్రమాదాల బారిన పడుతుంటే.. మరికొందరు జనాల మధ్య పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి యువతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి మెట్రో రైల్లో చేసిన నిర్వాకానికి పక్కన ఉన్న యువతులు కూడా సిగ్గుపడి పారిపోయారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబై మెట్రో రైల్లో (Mumbai Metro Train) ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లటి క్రాప్, స్కర్ట్ ధరించిన ఓ యువతి అందరితో పాటూ మెట్రో రైలు ఎక్కి యువతుల పక్కన కూర్చుంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అంతా ఊహించని ఘటన చోటు చేసుకుంది. అంతవరకూ బాగానే ఉన్న ఆమె.. ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు పైకి లేచి, డాన్స్ చేయడం మొదలెట్టింది.

Viral Video: వామ్మో..! ఇతనేంటీ.. విమానంలో ఇలా చేశాడు.. చివరికి ఏమైందో మీరే చూడండి..

అప్పటికే ఫోన్ పట్టుకుని సిద్ధంగా ఉన్న తన స్నేహితురాలి ఎదురుగా అటూ ఇటూ తిరుగుతూ డాన్స్ వేసింది. ఈమె విచిత్రమైన డాన్స్ చూసి అక్కడే ఉన్న అమ్మాయిలు సిగ్గుపడిపోతారు. కొందరు అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లిపోతారు. మరికొందరు స్టేషన్ వచ్చీ రాగానే గబా గబా లేచి కిందకు దిగిపోతారు. అయినా ఆమె మాత్రం తన మానాన తాను డాన్స్ వేస్తూనే ఉంటుంది. ఇంకొందరు ఈమె ప్రవర్తన చూసి.. అటుగా రావడానికి కూడా ఇబ్బంది పడిపోతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. సమయానికి వచ్చి ఇతన్ని ఎలా కాపాడిందో చూడండి..

Updated Date - Feb 27 , 2024 | 09:42 PM