Share News

Viral Video: సినిమాకి మించిన ట్విస్ట్.. ప్రియురాలితో షాపింగ్‌కి వెళ్తే.. ఇలా జరిగిందేంటీ..

ABN , Publish Date - Feb 29 , 2024 | 03:24 PM

భార్యాభర్తల మధ్య నిత్యం అనేక రకాల గొడవలు జరుగుతుంటాయి. వీటిలో ఎక్కువ శాతం వివాహేతర సంబంధాల కారణంగానే జరుగుతుంటాయి. కొన్నిసార్లు భర్తకు తెలీకుండా భార్య తప్పులు చేస్తుంటే.. మరికొన్నిసార్లు...

Viral Video: సినిమాకి మించిన ట్విస్ట్.. ప్రియురాలితో షాపింగ్‌కి వెళ్తే.. ఇలా జరిగిందేంటీ..

భార్యాభర్తల మధ్య నిత్యం అనేక రకాల గొడవలు జరుగుతుంటాయి. వీటిలో ఎక్కువ శాతం వివాహేతర సంబంధాల కారణంగానే జరుగుతుంటాయి. కొన్నిసార్లు భర్తకు తెలీకుండా భార్య తప్పులు చేస్తుంటే.. మరికొన్నిసార్లు భార్యకు తెలీకుండా భర్త పరాయి స్త్రీలతో సరసాలు ఆడుతుంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు వారు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సందర్భాలను కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రియురాలితో కలిసి హోటల్‌కి వెళ్లిన భర్త.. భార్య పెద్ద షాక్ ఇచ్చింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి పెద్ద షాపింగ్ మాల్‍‌కి వెళ్తాడు. లోపల ఇద్దరూ సరదాగా గడిపారు. అయితే మధ్యలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా సడన్‌గా అతడి భార్య వచ్చి నిలబడింది. ఆమెను చూడగానే అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతడి భార్యను చూడగానే ప్రియురాలు కూడా భయంతో పక్కకు తిరిగి నిల్చుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమె.. (wife slapped her husband) భర్తను చేత్తో ఫెడేల్‌మని గట్టిగా కొట్టింది.

Viral Video: ఇది కదా.. స్మార్ట్‌వర్క్ అంటే..! ఏమాత్రం కష్టపడకుండా ఈమె చేస్తున్న పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ పక్కన ఉన్న భర్త ప్రియురాలిని కూడా జుట్టు పట్టుకుని పక్కకు లాగి పడేసింది. తన కోపం చల్లారాక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భర్తకు భలె షాక్ ఇచ్చిందే’’.. అంటూ కొందరు, ‘‘ఈమె మంచిది కాబట్టి.. చెంపదెబ్బతో సరిపెట్టింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.80లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కుక్కర్‌ను ఇంత తెలివిగా ఎవరూ వాడలేరేమో.. ఈ విద్యార్థి తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - Feb 29 , 2024 | 03:24 PM