Share News

Viral Video: ఇది కదా.. స్మార్ట్‌వర్క్ అంటే..! ఏమాత్రం కష్టపడకుండా ఈమె చేస్తున్న పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Feb 28 , 2024 | 08:42 PM

కొందరు మహిళలు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. మరికొందరు మహిళలు తమ తెలివితేటలకు పదును పెట్టి కష్టమైన పనులను సైతం ఎంతో ఈజీగా చేసి పడేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ స్మార్ట్ వర్క్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఇది కదా.. స్మార్ట్‌వర్క్ అంటే..!’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇది కదా.. స్మార్ట్‌వర్క్ అంటే..! ఏమాత్రం కష్టపడకుండా ఈమె చేస్తున్న పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

రోజు వారీ పనిలో భాగంగా కొందరు శక్తికి మించి కష్టపడుతుంటారు. మరికొందరు అవే పనులను ఆడుతూ పాడుతూ చేసేస్తుంటారు. ఇంకొందరు మాత్రం తమ తెలివికి పదును పెట్టి పెద్ద పెద్ద పనులను సైతం ఎంతో సింపుల్‌గా చేసి పడేస్తుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు (Viral videos) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ ఏమాత్రం కష్టపడకుండా పెద్ద పనిని ఎంతో సింపుల్‌గా చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఫ్యాక్టరీలో అధిక సంఖ్యలో సైకిళ్లు (bicycles Manufacture) తయారవుతుంటాయి. అక్కడ పని చేసే కార్మికులు వారి వారి పనులు చేసేస్తుంటారు. అయితే ఇక్కడ పని చేస్తున్న ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం అంతా అవాక్కయ్యేలా చేస్తోంది. సైకిళ్లు టైర్లను ఓ వైపు వరుసగా పేర్చి ఉంటారు. వాటి పక్కన నిలబడ్డ మహిళ.. టైర్లకు కవర్లను తొడిగే పని చేస్తుంటుంది. అయితే వాటిని తొడిగేందుకు మాత్రం ఆమె ఏమాత్రం కష్టపడకుండా ఎంతో సింపుల్‌గా చేసేస్తోంది.

Viral Video: పాత టీషర్ట్‌తో మ్యాజిక్.. టెంకాయలు తెంపడానికి ఇతడు వాడిన టెక్నిక్ చూస్తే..

ముందుగా ఓ పెద్ద కవర్ నిండా గాలి నింపి.. దాని కొసను పట్టుకుంటుంది. తర్వాత దాన్ని సైకిల్ టైర్ మీదకు గట్టిగా విసురుతుంది. ఆ కవర్ కాస్తా.. టైరుకు పూర్తిగా మూసుకుపోతుంది. ఇది పైకి చూడ్డానికి నీట్‌గా ప్యాక్ చేసిన విధంగానే ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘స్మార్ట్ వర్క్ అంటే ఇదీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బాలికను రక్షించేందుకు కుక్క వెరైటీ ప్లాన్.. తుపాకీతో కాల్చగానే అది చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Feb 28 , 2024 | 08:42 PM