Share News

Viral Video: బ్యాడ్మింటన్ ఆడుతున్న యువతిని అడ్డుకున్న వ్యక్తి.. చివరికి అందరికీ ఎలాంటి షాక్ ఇచ్చాడో చూడండి..

ABN , Publish Date - Mar 01 , 2024 | 08:28 PM

కొందరు చేసే పనులు చూస్తే కోపం వస్తుంటుంది. మరికొందరు చేసే పనులు చూస్తే నవ్వు వస్తుంటుంది. అలాగే ఇంకొందరు చేసే పనులను చూస్తే నవ్వుతో పాటూ ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది. అంతా చేసే పనులను కొందరు విచిత్రంగా చేసి చూపిస్తుంటారు. అందులో వారి టాలెంట్ చూస్తే అంతలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: బ్యాడ్మింటన్ ఆడుతున్న యువతిని అడ్డుకున్న వ్యక్తి.. చివరికి అందరికీ ఎలాంటి షాక్ ఇచ్చాడో చూడండి..

కొందరు చేసే పనులు చూస్తే కోపం వస్తుంటుంది. మరికొందరు చేసే పనులు చూస్తే నవ్వు వస్తుంటుంది. అలాగే ఇంకొందరు చేసే పనులను చూస్తే నవ్వుతో పాటూ ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది. అంతా చేసే పనులను కొందరు విచిత్రంగా చేసి చూపిస్తుంటారు. అందులో వారి టాలెంట్ చూస్తే అంతలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సడన్‌గా ఎంటరై.. బ్యాడ్మింటన్ ఆడుతున్న యువతిని అడ్డుకున్నాడు. చివరికి అతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి మరో వ్యక్తితో కలిసి కోర్టులో బ్యాడ్మింటన్ (Badminton) ఆడుతుంటుంది. ఆట మధ్యలో ఓ వ్యక్తి చీపురు పట్టుకుని యువతి ఎదురుగా వస్తాడు. అక్కడ కాసేపు చీపురుతో ఊడ్చుతున్నట్లుగా నటించి, తర్వాత అక్కడున్న యువతిని పక్కకు వెళ్లమని చెప్తాడు. అతడి చేష్టలకు అవాక్కైన యువతి.. కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత చీపురు పట్టుకున్న వ్యక్తి.. ఆట కొనసాగించాలంటూ అవతల ఉన్న వ్యక్తికి సైగ చేస్తాడు.

Viral Video: సింహం నోట్లోనే చేయి పెట్టేశాడు భయ్యా.. ! చివరికి దాని రియాక్షన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

అవతలి వ్యక్తి బ్యాడ్మింటన్ రాకెట్‌తో ఆట ఆడుతుంటే.. ఇవతల ఉన్న వ్యక్తి మాత్రం (man played badminton with broom) చీపురుతోనే ఆట కొనసాగిస్తాడు. అయినా ఎక్కడా గురి తప్పకుండా ఆటను ఎంతో నేర్పుగా ఆడతాడు. చివరకు అవతలి వ్యక్తి కంటే ఎక్కువ పాయింట్స్ సాధిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ వ్యక్తి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘చీపురుతో బ్యాడ్మింటన్.. సూపర్ భయ్యా’’.. అంటూ ఇంకొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.80లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: ఊపిరాడక ఆస్పత్రికి వెళ్లిన రోగి.. స్కానింగ్ తీయగా.. ఊపిరితిత్తుల్లో షాకింగ్ సీన్.. చివరకు..

Updated Date - Mar 01 , 2024 | 08:28 PM