Share News

Viral Video: సింహం నోట్లోనే చేయి పెట్టేశాడు భయ్యా.. ! చివరికి దాని రియాక్షన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Mar 01 , 2024 | 07:51 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పడుకుని ఉన్న సింహం వద్దకు వెళ్తాడు. దాని తలను తన కాలిపై ఉంచుకుని, మీద చేయి వేసి నిమురుతాడు. సింహం కూడా అతడి చేష్టలకు రిలాక్స్‌గా ఫీలవుతూ ఉంటుంది. ఇలా చాలా సేపు సింహాన్ని నిమిరిన తర్వాత.. ఏకంగా..

Viral Video: సింహం నోట్లోనే చేయి పెట్టేశాడు భయ్యా.. ! చివరికి దాని రియాక్షన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

పులులు, సింహాలతో చెలగాటం ఆడి ప్రాణాలు తెచ్చుకున్న వారిని రోజూ చూస్తూనే ఉంటాం. అలాగే అదే క్రూరమృగాలతో స్నేహ చేసే వారిని కూడా చూస్తుంటాం. ఇంకొందరు వాటితో కుక్కలు, పిల్లుల తరహాలో ఆడుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఏకంగా సింహం నోట్లోనే చేయి పెట్టాడు. చివరికి సింహం ఏం చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పడుకుని ఉన్న సింహం వద్దకు వెళ్తాడు. దాని తలను తన కాలిపై ఉంచుకుని, మీద చేయి వేసి నిమురుతాడు. సింహం కూడా అతడి చేష్టలకు రిలాక్స్‌గా ఫీలవుతూ ఉంటుంది. ఇలా చాలా సేపు సింహాన్ని నిమిరిన తర్వాత.. ఏకంగా (man puts his hand inside lions mouth) దాని నోట్లోనే చేయి పెట్టేస్తాడు. అయినా సింహానికి కోపం రాదు కదా.. పైగా తనతో ఆడుకుంటుంది.

Viral Video: ఇతడి టాలెంట్‌కి ఫిదా అయిన ప్రొఫెసర్‌.. ఇలా సర్‌ప్రైజ్ చేయాలని.. ఎలా అనిపించిందయ్యా..!

ఇలా చాలా సేపు సింహం నోట్లో చేయి ఉంచినా.. అది ఎలాంటి హానీ చేయదు. ఇలా ఇద్దరూ కలిసి చాలా సేపు ఆడుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ సింహం చాలా సిల్లీగా ఉన్నట్టుందే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సింహాన్ని ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పనులు ప్రమాదాలకు దారి తీయొచ్చు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: ఊపిరాడక ఆస్పత్రికి వెళ్లిన రోగి.. స్కానింగ్ తీయగా.. ఊపిరితిత్తుల్లో షాకింగ్ సీన్.. చివరకు..

Updated Date - Mar 01 , 2024 | 07:51 PM