Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Viral Video: ఈ తల్లి ఎలుగు ప్రేమకు సెల్యూట్ చేయాల్సిందే.. నీళ్లలో పడిన పిల్ల ఎలుగుబంటిని చూసి..

ABN , Publish Date - Mar 02 , 2024 | 07:36 PM

సాధు జంతువులైనా, క్రూరజంతువులైనా.. తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. మనుషులతో పోలిస్తే.. జంతువులే మాత్రం తమ పిల్లలను ఎంతో గారాబంగా చూసుకుంటుంటాయి. కొన్నిసార్లు అవి తమ పిల్లలపై చూపించే ప్రేమ చూస్తే.. మనుషుల కంటే ఎంతో మేలని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి..

Viral Video: ఈ తల్లి ఎలుగు ప్రేమకు సెల్యూట్ చేయాల్సిందే.. నీళ్లలో పడిన పిల్ల ఎలుగుబంటిని చూసి..

సాధు జంతువులైనా, క్రూరజంతువులైనా.. తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. మనుషులతో పోలిస్తే.. జంతువులే మాత్రం తమ పిల్లలను ఎంతో గారాబంగా చూసుకుంటుంటాయి. కొన్నిసార్లు అవి తమ పిల్లలపై చూపించే ప్రేమ చూస్తే.. మనుషుల కంటే ఎంతో మేలని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నీళ్లలో పడిపోయిన పిల్ల ఎలుగుబంటిని కాపాడిన తల్లి ఎలుగును చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ తల్లి ఎలుగు ప్రేమకు సెల్యూట్ చేయాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ జూలోని ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లో (Bear enclosure) హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. నీటి కొలను వద్ద ఉన్న పిల్ల ఎలుగుబంటి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోతుంది. బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక నీటిలో మునిగిపోతుంది.. అని అనుకుంటున్న సమయంలో కొంచెం దూరంలో ఉన్న తల్లి ఎలుగుబంటి గమనిస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగు పరుగున అక్కడికి వస్తుంది.

Viral Video: బాబోయ్..! ఇదెక్కడి మాయాజాలం.. చూస్తుండగానే అన్నీ మాయం చేసిందిగా..

నీటిలోకి దూకి తన పిల్ల ఎలుగుబంటిని జాగ్రత్తగా పైకి చేరుస్తుంది. నీళ్లలో పడిపోయిన సందర్భంలో గడ్డ పైకి ఎలా ఎక్కాలో కూడా ఎంతో సున్నింతగా వివరిస్తూ పిల్ల ఎలుగుబంటిని రక్షిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ తల్లి ఎలుగు ప్రేమకు సెల్యూట్ చేయాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ తల్లి ఎలుగును చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‍‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బ్యాడ్మింటన్ ఆడుతున్న యువతిని అడ్డుకున్న వ్యక్తి.. చివరికి అందరికీ ఎలాంటి షాక్ ఇచ్చాడో చూడండి..

Updated Date - Mar 02 , 2024 | 07:36 PM