Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Viral Video: ట్రైనర్‌గా మారిన కుక్క.. పిల్లాడి ముందు దీని యాక్షన్ చూస్తే..

ABN , Publish Date - Mar 03 , 2024 | 09:37 PM

పెంపుడు కుక్కలు ఎంత తెలివిగా వ్యవహరిస్తుంటాయో రోజూ చూస్తూనే ఉంటాం. కొన్ని కుక్కలైతే మనుషులకే పాఠాలు నేర్పేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని కుక్కలు తమ యజమానులను అనేక రకాలుగా సాయం చేస్తుంటాయి. ఇలాంటి కుక్కల వీడియోలు ఇటీవల నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా..

Viral Video: ట్రైనర్‌గా మారిన కుక్క.. పిల్లాడి ముందు దీని యాక్షన్ చూస్తే..

పెంపుడు కుక్కలు ఎంత తెలివిగా వ్యవహరిస్తుంటాయో రోజూ చూస్తూనే ఉంటాం. కొన్ని కుక్కలైతే మనుషులకే పాఠాలు నేర్పేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని కుక్కలు తమ యజమానులను అనేక రకాలుగా సాయం చేస్తుంటాయి. ఇలాంటి కుక్కల వీడియోలు ఇటీవల నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ కుక్క పిల్లాడికి శిక్షకుడిగా మారింది. ఈ వీడియో చూసిన నెటిటజన్లు.. ‘‘ఈ కుక్క యాక్టింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెంపుడు కుక్క (pet dog) .. జోగాడుతున్న బుడ్డోడికి శిక్షకుడిగా మారింది. ఇంట్లో నేలపై ఓ బుడ్డోడు జోగాడుతూ ఉంటాడు. అయితే ముందుకు కదలడం చిన్నారికి కష్టంగా ఉంటుంది. దీన్ని గమనించిన వారి పెంపుడు కుక్క పరుగెత్తుకుంటూ పిల్లాడి వద్దకు వెళ్తుంది. ఎలా జోగాడాలో తాను చేసి చూపిస్తూ పిల్లాడి ముందు యాక్షన్ చేస్తుంది.

Viral Video: మరీ ఇంత ఈజీనా.. వావ్..! ఈ మహిళ ఆమ్లెట్ టెక్నిక్.. అదిరిపోయిందిగా..

పెంపుడు కుక్క.. అచ్చం మనిషిలాగే జోగాడుతూ.. ‘‘చేతులతో ఇలా అంటే ముందుకు వెళ్లొచ్చు.. ఇంతే.. సింపుల్’’.. అంటూ చిన్నారికి చూపిస్తూ అటూ ఇంటూ జోగాడి చూపిస్తుంది. ఆ పిల్లాడు కూడా కుక్కను ఆసక్తిగా గమనిస్తూ కేరింతలు కొడుతుంటాడు. ఈ ఘటనను యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అరే..! అచ్చం మనిషిలా భలే చేస్తోందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బావిలో ఈ ప్రేమికుల వింత సరదాలు మామూలుగా లేవుగా..

Updated Date - Mar 03 , 2024 | 09:37 PM