Share News

Viral Video: బావిలో ఈ ప్రేమికుల వింత సరదాలు మామూలుగా లేవుగా..

ABN , Publish Date - Mar 03 , 2024 | 06:12 PM

టాలెంట్ ఉండాలే గానీ సోషల్ మీడియా ద్వారా అనేక రకాలుగా ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేస్తూ.. వాటిని వీడియోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. వాటికి వచ్చిన లైక్స్, వ్యూస్ చూసుకుంటూ మురిసిపోతుంటారు. ఇలాంటి రీల్స్ చేసే సమయంలో కొందరు...

Viral Video: బావిలో ఈ ప్రేమికుల వింత సరదాలు మామూలుగా లేవుగా..

టాలెంట్ ఉండాలే గానీ సోషల్ మీడియా ద్వారా అనేక రకాలుగా ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేస్తూ.. వాటిని వీడియోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. వాటికి వచ్చిన లైక్స్, వ్యూస్ చూసుకుంటూ మురిసిపోతుంటారు. ఇలాంటి రీల్స్ చేసే సమయంలో కొందరు ప్రమాదాల బారిన పడడం కూడా చూస్తుంటాం. మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమజంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఇది మరీ విడ్డూరం భయ్యా’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వరల్ అవుతోంది. నెట్టింట వైరల్ కావాలనే ఉద్దేశంతో ఓ ప్రేమ జంట వినూత్న విన్యాసం ( Lovers Innovative Stunts) చేసింది. ఇందుకోసం మంచానికి రెండు వైపులా తాళ్లు కట్టి దాన్ని బావి మధ్యలో వేలాడదీశారు. చివరగా మంచంపై కూర్చుని డాన్సులు చేస్తూ కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ఇద్దరూ పోటాపోటీగా డాన్సులు వేస్తూ, అల్లరి చేశారు. ఈ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా బావిలో పడిపోయే అవకాశం ఉంది.

Viral Video: ఇండియాలో టాలెంట్‌కి కొదవే లేదు.. ఈ ఆటో స్టంటే అందుకు నిదర్శనం.. వీళ్లు టైరు మార్చిన స్టైల్ చూస్తే..

అయినా ఆ ప్రేమికులు ఏమాత్రం భయం లేకుండా లైక్‌లు, వ్యూస్ కోసం ఈ విన్యాసానికి పూనుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ ప్రేమికుల సరదాలు మామూలుగా లేవుగా’.. అంటూ కొందరు, ‘‘రీల్స్ పిచ్చి పీక్స్‌కు వెళ్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 57వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ విచిత్ర ఆకారం.. తీక్షణంగా పరిశీలించగా.. చివరకు..

Updated Date - Mar 05 , 2024 | 01:20 PM