Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Viral Video: మరీ ఇంత ఈజీనా.. వావ్..! ఈ మహిళ ఆమ్లెట్ టెక్నిక్.. అదిరిపోయిందిగా..

ABN , Publish Date - Mar 03 , 2024 | 08:54 PM

వంటకాలకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొత్త కొత్త రెసిపీలతో సరికొత్త వంటకాలు చేస్తూ కొందరు, చేసే వంటనే తమదైన స్టైల్‌లో అందరినీ ఆకర్షిస్తూ మరికొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా, ఓ మహిళ ఆమ్లెట్ వేసిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Viral Video: మరీ ఇంత ఈజీనా.. వావ్..! ఈ మహిళ ఆమ్లెట్ టెక్నిక్.. అదిరిపోయిందిగా..

వంటకాలకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొత్త కొత్త రెసిపీలతో సరికొత్త వంటకాలు చేస్తూ కొందరు, చేసే వంటనే తమదైన స్టైల్‌లో అందరినీ ఆకర్షిస్తూ మరికొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా, ఓ మహిళ ఆమ్లెట్ వేసిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ ఈ మహిళ ఆమ్లెట్ టెక్నిక్.. అదిరిపోయిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఆమ్లెట్ వేసే (Making an omelette) సమయంలో రెండో వైపు తిప్పడంలో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యను అధిగమించడానికి ఓ మహిళ (woman) వినూత్నంగా ఆలోచించింది. ఇందుకోసం ఆమె ముందుగా పాన్‌పై రెండు పొడవాటి దారాలను ఒకదానిపై మరొకటి క్రాస్‌గా పరిచింది. ఆ తర్వాత ఆ దారాలపై గుడ్డు పగులగొట్టి వేసింది.

Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ విచిత్ర ఆకారం.. తీక్షణంగా పరిశీలించగా.. చివరకు..

ఆమ్లెట్ కింద భాగం బాగా కాలిన తర్వాత రెండు వైపు తిప్పేందుకు.. దారాల నాలుగు కొసలను పట్టుకుని పైకి ఎత్తి ఈజీగా తిప్పేసింది. ఇలా రెండో వైపు కూడా ఈజీగా తిప్పేసింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.. అంటూ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఆమ్లెట్ ఇలాక్కూడా వేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఐడియా ఏదో బాగుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బావిలో ఈ ప్రేమికుల వింత సరదాలు మామూలుగా లేవుగా..

Updated Date - Mar 03 , 2024 | 08:57 PM