Share News

Viral: ఈ గొరిల్లాల యాక్టింగ్ మామూలుగా లేదుగా.. సెల్ఫీ తీసుకుంటుండగా..

ABN , Publish Date - Mar 05 , 2024 | 05:45 PM

గొరిల్లాలు అచ్చం మనుషుల్లాగే ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. కొన్ని వాహనాలు శుభ్రం చేస్తే.. మరికొన్ని దుస్తులు ఉతకడం, ఇంకొన్ని ఏకంగా మనిషిని మక్కీకి మక్కీ దించేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral: ఈ గొరిల్లాల యాక్టింగ్ మామూలుగా లేదుగా.. సెల్ఫీ తీసుకుంటుండగా..

గొరిల్లాలు అచ్చం మనుషుల్లాగే ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. కొన్ని వాహనాలు శుభ్రం చేస్తే.. మరికొన్ని దుస్తులు ఉతకడం, ఇంకొన్ని ఏకంగా మనిషిని మక్కీకి మక్కీ దించేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కెమెరా ముందు గొరిల్లాలు ఇచ్చిన ఫొజులు చూసి నెటిజనన్లు అవాక్కవుతున్నారు. ఈ ఫొటో చూసిన వారంతా.. ‘‘ఈ గొరిల్లాల యాక్టింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని (Democratic Republic of the Congo) విరుంగా నేషనల్ పార్క్‌లోని ఈ ఘటన చోటు చేసుకుంది. వేటగాళ్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గొరిల్లా (gorilla) పిల్లలను ఇక్కడ పెంచుతున్నారు. వాటికి ఇద్దరిని కాపలాగా ఉంచారు. అయితే ఇటీవల సదరు రేంజర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో (Viral photos) ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గొరిల్లాల వద్ద సెల్ఫీ తీసుకుంటున్న రేంజర్‌ను అవి గమనించాయి. పనిలో పనిగా మనుషుల్లాగే నిలబడి కెమెరాకు ఫోజులు ఇచ్చాయి.

Viral Video: ట్రైనర్‌గా మారిన కుక్క.. పిల్లాడి ముందు దీని యాక్షన్ చూస్తే..

గొరిల్లాలు అచ్ఛం మనుషుల్లాగే ఎంతో బుద్ధిగా నిలబడి అవి ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ గొరిల్లాల చిన్నప్పటి నుంచి చూసుకుంటుండడంతో తమకు బాగా అలవాటు పడ్డాయని సదరు రేంజర్ తెలిపాడు. కాగా, ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గొరిల్లాల యాక్టింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎంతో బుద్ధిగా నటిస్తు్న్నాయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దీపావళి రాకెట్‌పై దూసుకెళ్లిన ప్రేమికులు.. వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..

Updated Date - Mar 05 , 2024 | 05:45 PM