Share News

Viral Video: ముచ్చెమటలు పట్టించిన కోతి.. స్కూటీ దిగనంటే దిగనంటూ.. చివరకు ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందంటే..

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:43 PM

కోతి చేష్టలు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఆశ్చర్యం కూడా కలిగిస్తుంటాయి. తినుబండారాల కోసం మనుషులపై దాడులు చేసే కోతులను చూశాం, ఇళ్లల్లో్కి చొరబడి ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లే కోతులను సైతం చూశాం. అయితే...

Viral Video: ముచ్చెమటలు పట్టించిన కోతి.. స్కూటీ దిగనంటే దిగనంటూ.. చివరకు ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందంటే..

కోతి చేష్టలు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఆశ్చర్యం కూడా కలిగిస్తుంటాయి. తినుబండారాల కోసం మనుషులపై దాడులు చేసే కోతులను చూశాం, ఇళ్లల్లో్కి చొరబడి ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లే కోతులను సైతం చూశాం. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కోతి స్కూటీపై కూర్చుని ఓ వ్యక్తికి ముచ్చెమటలు పట్టించింది. స్కూటీ దిగనంటే దిగనంటూ అది చేసిన నిర్వాకం చూసి అంతా అవక్కయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మెయిన్‌పురిలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి స్కూటీపై కూర్చుని ఉండగా.. అనుకోకుండా ఓ కోతి అక్కడికి వస్తుంది. వచ్చీ రాగానే ఒక్కసారిగా స్కూటీ పైకి ఎగిరి (monkey sitting on scooty) హ్యాండిల్‌పై కూర్చుంటుంది. దీంతో సదరు వ్యక్తి మొదట భయపడిపోతాడు. ఎక్కడ తనపై దాడి చేస్తుందో అని భయపడతాడు. అయితే కోతి అతన్ని ఏమీ చేయకుండా ముందుగా.. అతడి కళ్లద్దాలను లాక్కుంటుంది. దీంతో అతను కూడా పైకి నవ్వుతూ ఏంతో ఓపిగ్గా.. ‘‘అయ్యో..! అద్దాలు తీసుకోవద్దు.. పగిలిపోతాయ్.. ఇవ్వు ఇవ్వు’’.. అంటూ వాటిన తీసుకుంటాడు.

Viral Video: గుడ్లను తినేందుకు వెళ్లిన పామును.. ఈ పక్షులన్నీ కలిసి ఎలా పరేషాన్ చేశాయో చూడండి..

తర్వాత కోతి అతని తలపై చేతులు పెట్టి.. ‘‘ఎన్ని రోజులైంది నిన్ను చూడక.. ఎలా వున్నావ్’’.. అని క్షేమ సమచారం అడుగుతున్నట్లుగా అతడి వైపు చూస్తుంది. అతను కూడా కోతితో స్నేహంగా మాట్లాడతాడు. మధ్యలో కోతిని అక్కడి నుంచి పంపించేందుకు.. బిస్కట్లు తెప్పించాలని చూస్తాడు. ఎంత ఆశ చూపించినా కోతి మాత్రం పక్కకు వెళ్లకుండా స్కూటీపై కూర్చుని అతడి వైపే చూస్తూ ఉంటుంది. అతడిపై కోతి చూపించిన ప్రేమ చూసి పక్కన ఉన్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఇలా చాలా సేపు కోతి స్కూటీ పైనే కూర్చుని ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ కోతి చాలా ఫన్నీగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘వీరి ప్రేమానురాగాలు చూస్తుంటే.. ముచ్చటేస్తోంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 51వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లివేదికపై ఉన్నట్టుండి షాకింగ్ ట్విస్ట్.. చివరకు వధువును ఆస్పత్రికి తీసుకెళ్లగా..

Updated Date - Mar 06 , 2024 | 04:43 PM