Share News

Viral Video: పిల్లలను సున్నితంగా ఎలా హెచ్చరించాలో.. ఈ కోతిని చూస్తే తెలిసిపోతుంది..

ABN , Publish Date - Mar 06 , 2024 | 07:25 PM

కొన్ని జంతువులు.. మనుషులు చేసే పనులనే కాదు, హావభావాలను కూడా మక్కీకి మక్కీ దింపేస్తుంటాయి. నడక, నవ్వు, బాధ, సంతోషం.. ఇలా చాలా వివిధ రకాల ఫీలింగ్స్‌ను మనుషుల్లాగే చూపిస్తుంటాయి. అయితే కొన్ని జంతువులు ఓ అడుగు ముందకేసి.. మనుషులకే కనువిప్పు కలిగిస్తుంటాయి. చిన్న పిల్లల పట్ల ...

Viral Video: పిల్లలను సున్నితంగా ఎలా హెచ్చరించాలో.. ఈ కోతిని చూస్తే తెలిసిపోతుంది..

కొన్ని జంతువులు.. మనుషులు చేసే పనులనే కాదు, హావభావాలను కూడా మక్కీకి మక్కీ దింపేస్తుంటాయి. నడక, నవ్వు, బాధ, సంతోషం.. ఇలా చాలా వివిధ రకాల ఫీలింగ్స్‌ను మనుషుల్లాగే చూపిస్తుంటాయి. అయితే కొన్ని జంతువులు ఓ అడుగు ముందకేసి.. మనుషులకే కనువిప్పు కలిగిస్తుంటాయి. చిన్న పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తించే తల్లిదండ్రులకు ఓ కోతి కనువిప్పు కలిగించేలా ప్రవర్తించింది. పిల్లలను ఎలా సున్నితంగా హెచ్చరించాలో చేసి చూపించింది. కోతి చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని కోతులన్నీ కలిసి ఓ ప్రాంతంలో కూర్చుని ఉంటాయి. అయితే వాటిలో ఓ కోతి పిల్ల అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. దీంతో తల్లి కోతికి కోపం వస్తుంది. వెళ్తున్న కోతి పిల్లను జుట్టు పట్టుకుని దగ్గరకు లాక్కుంటుంది. ‘‘ఎన్నిసార్లు చెప్పినా వినవు.. ఇంకోసారి చెప్పినట్లు వినకపోతే చెంప వాసిపోతుంది’’.. అన్నట్లుగా తన పిల్ల కోతి చెంపపై (mother monkey slapped baby monkey) సున్నితంగా ఓ దెబ్బ కొడుతుంది. పిల్ల కోతి కూడా ‘‘ఇంకోసారి తప్పు చేయను.. నన్ను వదిలేయ్’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.

Viral Video: ముచ్చెమటలు పట్టించిన కోతి.. స్కూటీ దిగనంటే దిగనంటూ.. చివరకు ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందంటే..

పిల్ల కోతిని సున్నితంగా హెచ్చరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తెలిసీ తెలీక తప్పులు చేసే చిన్న పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తించే తల్లిదండ్రులు.. ఈ కోతిని చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వవిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ కోతి ఎంతో ప్రేమతో జాగ్రత్తలు చెబుతోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ కోతిని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లివేదికపై ఉన్నట్టుండి షాకింగ్ ట్విస్ట్.. చివరకు వధువును ఆస్పత్రికి తీసుకెళ్లగా..

Updated Date - Mar 06 , 2024 | 07:25 PM