Share News

Optical illusion: పెయింటింగ్ వేస్తున్న ఈ పిల్లాడి ఫొటోలో పెద్ద తప్పు ఉంది.. అదేంటో చెప్పగలరా..?

ABN , Publish Date - Mar 08 , 2024 | 04:34 PM

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ఆసక్తిని కలిగించడంతో పాటూ మెదడుకు వ్యాయామంలా కూడా ఉపయోగపడతాయి. వాటిని పరిష్కరించే క్రమంలో మీ దృష్టి అనవసర విషయాలపై మళ్లకుండా ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉంటుంది. తద్వారా మీలో ఏకాగ్రత పెరుగుతుంది. ఇందుకోసం సోషల్ మీడియాలో అనేక ఫొటోలు, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం...

Optical illusion: పెయింటింగ్ వేస్తున్న ఈ పిల్లాడి ఫొటోలో పెద్ద తప్పు ఉంది.. అదేంటో చెప్పగలరా..?

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ఆసక్తిని కలిగించడంతో పాటూ మెదడుకు వ్యాయామంలా కూడా ఉపయోగపడతాయి. వాటిని పరిష్కరించే క్రమంలో మీ దృష్టి అనవసర విషయాలపై మళ్లకుండా ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉంటుంది. తద్వారా మీలో ఏకాగ్రత పెరుగుతుంది. ఇందుకోసం సోషల్ మీడియాలో అనేక ఫొటోలు, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫొటోలో ఓ పిల్లాడు పెయింటింగ్ వేస్తున్నాడు. అయితే ఇందులో ఓ తప్పు ఉంది. ఆ తప్పేంటో గుర్తిస్తే మీలో పరిశీలనా శక్తి ఎక్కువ ఉన్నట్లు అర్థం.

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ఒకటి (Optical illusion viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ పిల్లాడు నేలపై పడుకుని పెయింటింగ్ (Painting) వేస్తున్నాడు. అతడి చుట్టూ చాలా రకాల వస్తువులు కూడా ఉన్నాయి. వాటిలో కారు, లారీ, విమానం, రాకెట్‌తో బొమ్మలతో పాటూ పుస్తకం, బంతి తదితర వస్తువులు ఉన్నాయి. పిల్లాడు పడుకుని బ్రష్‌తో సముద్రంపై పడవను గీస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ పెద్ద తప్పు తాగి ఉంది. అయితే దాన్ని గుర్తించడం అంత ఈజీ ఏమీ కాదు. దాన్ని సులభంగా గుర్తించాలంటే.. మీ దృష్టిని పిల్లాడు వేస్తున్న బొమ్మపై కాకుండా చుట్టూ ఉన్న వస్తువులపై కేంద్రీకరిస్తే తప్పు ఈజీగా తెలిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ తప్పేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఇది మీకు సాధ్యం కాకపోతే ఈ కింద ఇచ్చిన ఫొటో చూస్తే.. అందులోని తప్పేంటో అర్థమవుతుంది.

Viral Video: కిటికీలకు గుంపులుగా వేలాడుతున్న యువకులు.. విషయం ఏంటా సమీపానికి వెళ్లి చూడగా..

optical-illusion-trending-p.jpg

పిల్లాడు నేలపై పడుకుని బొమ్మ వేస్తున్నాడు. పక్కన చాలా వస్తువులు ఉన్నాయి. ఇదంతా ఓకే గానీ.. ఆ పక్కనే ఓ కిటికీ ఉంది. దాని తెరలు తీసి ఉన్నాయి. కిటికీ బయట చెట్లు, పక్షులు, మేఘాలు కనిపిస్తున్నాయి. అంటే బాలుడు గోడపై పడుకుని బొమ్మ గీయడం సాధ్యం కాదు కాబట్టి.. ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పు.. అక్కడ కిటికీ ఉండడమే. ఈ తప్పును ఇప్పటికే మీరు గుర్తించి ఉంటే.. మీ పరిశీలనా శక్తి అద్భుతంగా ఉన్నట్లే. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Optical illusion: ఈ పార్కులో ఓ సింహం దాక్కుంది.. దాన్ని కనిపెట్టగలిగితే మీరే కింగ్..

Updated Date - Mar 08 , 2024 | 04:34 PM