Share News

Viral Video: కేరళలో ఏఐ టీచర్.. ఈ పంతులమ్మ ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..

ABN , Publish Date - Mar 07 , 2024 | 06:50 PM

రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి మేథస్సు నుంచి పుట్టిన అనేక ఆవిష్కరణలు.. మనుషులే ఆశ్చర్యపడేలా పని చేయడం చూస్తూ ఉన్నాం. ఇటీవల టెక్నాలజీ రంగంలో ఏఐ.. పెనుమార్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఈ టెక్నాలజీతో...

Viral Video: కేరళలో ఏఐ టీచర్.. ఈ పంతులమ్మ ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..

రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి మేథస్సు నుంచి పుట్టిన అనేక ఆవిష్కరణలు.. మనుషులే ఆశ్చర్యపడేలా పని చేయడం చూస్తూ ఉన్నాం. ఇటీవల టెక్నాలజీ రంగంలో ఏఐ.. పెనుమార్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఈ టెక్నాలజీతో మన కళ్లను మనమే నమ్మలేని విధంగా వీడియోలు, ఫొటోలు రూపొందించడమే కాకుండా అనేక కార్యకలాపాలను చేసుకునే వెలుసుబాటు ఉంటుంది. ఇటీవల ఏఐ టెక్నాలజీతో వార్తలు చదివే యాంకర్లను సైతం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా, దేశంలోనే తొలిసారిగా కేరళ స్కూల్లో ఏఐ టీచర్.. విద్యార్థులకు పాఠాలు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఏఐ టీచర్ (AI teacher) వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. కేరళలోని (Kerala) తిరువనంతపురంలోని కేటీసీటీ పాఠశాలలో.. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ టీచర్‌తో విద్యార్థులకు పాఠాలు చెప్పించి అందరినీ ఆశ్చర్యపరచారు. రోబోటిక్స్‌, జెనరేటివ్‌ టెక్నాలజీని ఉపయోగించి.. అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగా కొచ్చికి చెందిన స్టార్టప్ సంస్థ మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సహకారంతో దీన్ని ఆవిష్కరించారు. ఏఐ ఆధారిత ఐరిస్‌ రోబోట్‌.. మూడు భాషల్లో మాట్లాడడంతో పాటూ కష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలదని స్కూల్ యాజమాన్యం తెలిపింది.

Viral Video: యువతి నిర్వాకానికి అవాక్కైన ప్రయాణికులు.. ఆమె చేష్టలతో అంతా విసిగిపోయినా..

ఇంటెల్‌ ప్రాసెసర్‌ కలిగిన ‘ఐరిస్‌’లో వాయిస్‌ అసిస్టెంట్‌, ఇంటరాక్టివ్‌ లెర్నింగ్‌ మాడ్యూల్స్‌, మొబిలిటీ.. మొదలైన ఆప్షన్లు ఉన్నట్టు సంస్థ తెలిపింది. ఈ ఏఐ టీచర్ భారతీయ సంస్కృతిని ప్రతిభింభించేలా చీర కట్టులో కనిపించింది. తరగతి గదిలోకి రాగానే ముందుగా విద్యార్థులను పరిచయం చేసుకుంది. ఏఐ టీచర్ పాఠాలు చెప్పడం కొత్తగా అనిపించడంతో విద్యార్థులంతా ఆసక్తిగా తిలకించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ టీచర్ భలే స్మార్ట్‌గా ఉందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ టెక్నాలజీతో టీచర్లకు అన్యాయం జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కిటికీలకు గుంపులుగా వేలాడుతున్న యువకులు.. విషయం ఏంటా సమీపానికి వెళ్లి చూడగా..

Updated Date - Mar 07 , 2024 | 06:50 PM