ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: విమానంలో ఇదేం పాడుపని.. మద్యం తాగి మరీ ఇంత నీచంగానా..?

ABN, Publish Date - Apr 23 , 2024 | 07:36 PM

ఈజీజెట్ విమానంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు నానా రాద్ధాంతం సృష్టించాడు. తోటి ప్రయాణికుడితో...

Drunk EasyJet Passenger Throws Punches At Flight Attendants

ఈజీజెట్ విమానంలో (Easyjet Flight) ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు (Passenger) నానా రాద్ధాంతం సృష్టించాడు. తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. ఆపై అతడ్ని వారించేందుకు వచ్చిన పోలీసు అధికారితో (Police Officer) పాటు మహిళా ఎయిర్‌లైన్ ఉద్యోగిపై (Flight Attendant) కూడా అతడు చెయ్యి చేసుకున్నాడు. ఈ పరిణామంతో విమానంలోని ఇతర ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన టర్కీలో (Turkey) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


టీ పెట్టిన చిచ్చు.. పెళ్లిలో కొట్టేసుకున్న బంధువులు.. చివర్లో పెద్ద ట్విస్ట్

ఈజీజెట్‌కు చెందిన ఓ విమానం ఇటీవల ఎడిన్‌బర్గ్ నుంచి టర్కీకి బయలుదేరింది. ఈ విమానంలో కూర్చున్న ఓ ప్యాసింజర్.. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచే మద్యం మత్తులో ఉన్నాడు. అతడు స్కాటిష్ ఫుట్‌బాల్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ని చూస్తూ.. ఇతరులకు ఇబ్బంది కలిగించాడు. గట్టిగట్టిగా అరుస్తూ తోటి ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురి చేశాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఓ వ్యక్తి అతనిపై అసహనం వ్యక్తం చేశాడు. మౌనంగా కూర్చోలేవా అంటూ అరిచాడు. దీంతో.. ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఇది చూసిన ఓ ఫ్లైట్ అటెండెంట్.. వారి వద్దకు వెళ్లి సర్దిచెప్పేందుకు ప్రయత్నించింది. ఇదే సమయంలో పోలీసు అధికారి కూడా వచ్చాడు. అయినా మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వినిపించుకోకపోగా.. ఆ ఇద్దరిపైకే దాడికి తెగబడ్డాడు. ముఖ్యంగా.. మహిళా ఎయిర్‌లైన్ ఉద్యోగిపై పిడిగుద్దులు గుద్దాడు. అప్పుడు అందరూ అతడ్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించారు.

వేగంగా బరువు తగ్గాలంటే.. ఈ రూల్స్ పాటించాలి

ఈ ఘటనపై ఈజీజెట్‌ అధికారులు మాట్లాడుతూ.. ‘‘మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు విమానంలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడంతో, అతడ్ని పోలీసులకు అప్పగించాం. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతకు మా సంస్థ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇలాంటి సంఘటనలను మేము ఎప్పటికీ సహించం’’ అని పేర్కొన్నారు. కాగా.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి ఎంత భయపడుతోందో మనం గమనించవచ్చు. ఆ వ్యక్తి దాడికి తెగబడినప్పటికీ.. ఆ అమ్మాయి వణికిపోయింది. తోటి ప్రయాణికులు కూడా ఒక్కసారిగా హతాశులయ్యారు.

Read Latest Prathyekam News And Telugu News

Updated Date - Apr 23 , 2024 | 07:37 PM

Advertising
Advertising