మందార టీ.. ఇలా చేసుకుని తాగితే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..
ABN, Publish Date - Dec 26 , 2024 | 02:12 PM
మందార ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మందార ఆకులతో చేసిన టీ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది..మందార టీ ఎలా చేసుకోవాలో చూద్దాం
ముందుగా తాజా, ఎండిపోయిన మందార పువ్వులను తీసుకోవాలి. ఈ పువ్వులని శుభ్రంగా కడిగాలి.
ఆ తర్వాత స్టవ్‌పైన టీ బౌల్‌లో నీటిని మరిగించి ఆ నీటిలో మందార పూలను వేయాలి.
ఈ నీటిని 5-7 నిమిషాలపాటు మరిగించాలి.
మరుగుతున్నప్పుడు నీటి రంగు మారుతుంది. అందులో తేనె వేసుకోవాలి.
మందార టీ చల్లగా తాగాలనుకుంటే అందులో ఐస్ టాపింగ్ చేసుకోవాలి.
చివరిలో నిమ్మకాయ స్లైస్, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే మందార టీ రెడీ..
Updated Date - Dec 26 , 2024 | 02:14 PM