చలికాలంలో వీరు పొరపాటున కూడా ఉసిరి కాయ తినకూడదు..
ABN, Publish Date - Dec 18 , 2024 | 06:48 AM
ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఉసిరి అస్సలు తినకూడదు.
ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, కె, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్ వంటి మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
టైప్ 1, 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులకు ఉసిరి చాలా మేలు చేస్తుంది. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండటం మంచిది.
గుండెల్లో మంట సమస్యలు ఉన్నవారు ఉసిరి తీసుకోకూడదు. శీతాకాలంలో చాలా మంది జలుబు, దగ్గు సమస్యలతో బాధపడతారు. వీరు ఉసిరి కాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
కడుపు సమస్యలు, మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండాలి.
ఉసిరికాయను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. పొడి చర్మం, స్కాల్ప్ డ్రైగా ఉన్నవారు ఉసిరికాయను ఎక్కువగా తినకూడదు.
హైపర్ ఎసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉసిరి తినడం వల్ల కడుపులో చికాకు, ఆమ్లత్వం ఏర్పడుతుంది.
Updated Date - Dec 18 , 2024 | 06:52 AM