ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yadadri: వైభవంగా లక్ష్మీనారసింహుడి తిరుకల్యాణం

ABN, Publish Date - Mar 19 , 2024 | 01:34 PM

యాదగిరిగుట్ట: జగత్కల్యాణ కారకుడు, భక్తజనబాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ పర్వాలు సోమవారం రాత్రి వైభవంగా కొనసాగాయి. యాదగిరికొండపై ఉత్తర తిరుమాఢ వీధిలోని తాత్కాలిక బ్రహ్మోత్సవ కల్యాణ వేదికపై అంగరంగ వైభవంగా కల్యాణ తంతును అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. వివిధ రకాల పుష్పా లు, అరటి, మామిడి తోరణాలు, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించిన కల్యా ణ వేదికపై అర్చకబృందం వేద మంత్రోచ్ఛారణ, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ లక్ష్మీనరసింహుల కల్యాణం కన్నుల పండువగా సాగింది.

1/6

యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ తంతును అర్చకులు, వేదపండితులు వైభవంగా నిర్వహిస్తున్న దృశ్యం.

2/6

వేద మంత్రోచ్ఛారణ, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ లక్ష్మీనరసింహుల కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఈ తిరుకల్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు..

3/6

యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకల్యాణంలో సామాన్య భక్తులుగా పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య దంపతులు.

4/6

శ్రీ లక్ష్మీనృసింహుడి తిరుకల్యాణంలో పాల్గొన్న మంత్రులకు వేదపండితులు గోత్ర నామాలు చదివి ఆశీర్వదిస్తున్న దృశ్యం.

5/6

పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణ పట్టువస్త్రాలను ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు దంపతులు కల్యాణ వేదికపై అర్చకస్వాములకు అందజేస్తున్న దృశ్యం.

6/6

శ్రీ లక్ష్మీనృసింహుడి తిరుకల్యాణంలో పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దంపతులు స్వామి వారికి వస్త్రాలు, పండ్లు సమర్పిస్తున్న దృశ్యం.

Updated Date - Mar 19 , 2024 | 01:34 PM

Advertising
Advertising