Congress: ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించిన మంత్రులు
ABN, Publish Date - Sep 25 , 2024 | 01:50 PM
మహబూబ్‌నగర్: జడ్చర్ల నియోజకవర్గ ఉదండాపూర్ రిజర్వాయర్‌ను మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, భక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి తదితరులు పరిశీలించారు. ఈ శాసనసభ ముగిసేలోపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తమదని, జిల్లాల్లోని ఇతర పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేస్తామని, అది మా ఏకైక లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులను స్థానిక నేతలు స్వాగతం పలుకుతున్న దృశ్యం..
కాంగ్రెస్ మంత్రులను శాలువాలతో సన్మానిస్తు్న్న మహబూబ్‌నగర్ జిల్లా నేతలు..
జడ్చర్ల మండలం, ఉదండాపూర్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమవుతున్న ఉదండాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపన..
ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తు్న్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
బహిరంగ సభలో ప్రసంగిస్తు్న్న నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లురవి..
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మొక్కను బహుకరిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి..
Updated Date - Sep 25 , 2024 | 01:50 PM