Poling: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ABN, Publish Date - Apr 19 , 2024 | 12:12 PM
తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో 6.23 కోట్ల మంది ఓటర్లుండగా, వారి కోసం 68,321 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 77 మంది మహిళా అభ్యర్థులు, 873 మంది పురుష అభ్యర్థులు కలిపి మొత్తం 950 మంది బరిలో నిలిచారు. ఇందులో డీఎంకే నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి, బీజేపీ నేతృత్వంలోని ‘ఎన్డీయే’ కూటమి మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తున్నప్పటికీ, అన్నాడీఎంకే బాగా బలహీనపడటంతో డీఎంకే, బీజేపీ నేతృత్వంలోని కూటముల మధ్యే హోరాహోరీ నెలకొంది. అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ, సీని ప్రముఖులు
తమిళనాడులో జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్.
కోయంబత్తూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్..
పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యం.
తమిళనాడులో జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్..
తమిళనాడు మాజీ సీఎం, ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి సేలంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యం.
చెన్నైలోని కోయంబేడులోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన కమల్ హాసన్.. తర్వాత వేలు చూపిస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్న దృశ్యం.
బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ గవర్నర్ తమిళిసై చెన్నైలోని సాలిగ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకుని.. వేలు చూపుతున్న దృశ్యం.
తమిళనాడులో జరుగుతున్న తొలి దశ పోలింగ్‌లో కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పీ చిదంబరం ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వేలు చూపుతున్న దృశ్యం.
తమిళనాడులో జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ నేత ఖుష్బూ..
Updated Date - Apr 19 , 2024 | 12:12 PM