తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోకేష్ కుటుంబం..
ABN, Publish Date - Mar 22 , 2024 | 11:45 AM
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను కలిసిన పార్టీ నాయకులతో ఆప్యాయంగా మాట్లాడారు. తిరుమలలోని గాయత్రి సదన్ అతిథిగృహం వద్దకు బుధవారం రాత్రి చేరుకున్న ఆయన అక్కడున్న కార్యకర్తలతో మాట్లాడారు. దాదాపు 15 నిమిషాలు బయటే నిలబడి కార్యకర్తలతో ఫొటోలు దిగారు. గురువారం కూడా శ్రీవారి దర్శనానంతరం తనను చూసేందుకు వచ్చిన నాయకులతో, కార్యకర్తలతో కొంతసేపు మాట్లాడారు. ‘ఎలా ఉన్నారు, మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా పనిచేయండి’ అని లోకేష్ సూచించారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన సతీమణి నారా బ్రహ్మణి, తనయుడు దేవాన్ష్, తల్లి నారా భువనేశ్వరి..
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబం.. స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తున్న దృశ్యం.
తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన నారా లోకేష్.. అక్కడ స్వామివారి సేవకులను (మహిళలు) పలుకరించి మాట్లాడుతున్న దృశ్యం...
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నారా లోకేష్ కుటుంబం అన్నదానం సత్రంలో భోజనం చేస్తున్న దృశ్యం.
తిరుమల శ్రీవారి అన్నదాన సత్రంలో భక్తులకు భోజనం వడ్డిస్తున్న నారా లోకేష్, ఆయన తల్లి నారా భువనేశ్వరి..
తిరుమల శ్రీవారి అన్నదాన సత్రంలో భక్తులకు భోజనం వడ్డిస్తున్న నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి..
తిరుమలలోని గాయత్రి సదన్ అతిథిగృహం వద్ద తనను చూసేందుకు వచ్చిన అభిమానులతో నాలా లోకేష్ ఆప్యాయంగా పలుకరించి మాట్లాడుతున్న దృశ్యం.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు టీడీపీ నేతలు స్వామివారి మెమెంటోను బహూకరిస్తున్న దృశ్యం..
Updated Date - Mar 25 , 2024 | 03:36 PM