ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై వాషింగ్టన్‌లో ఎన్నారైల సమావేశం

ABN, Publish Date - Jan 10 , 2024 | 09:19 AM

తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి విజయవంతంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భంగా ఆదివారం (7వ తేదీ) అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీ, ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ హోటల్‌లో పోచంపల్లి తిరుపతి రెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అభిమానులు సమావేశం నిర్వహించారు.

వాషింగ్టన్: తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి విజయవంతంగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భంగా ఆదివారం (7వ తేదీ) అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీ, ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ హోటల్‌లో పోచంపల్లి తిరుపతి రెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అభిమానులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు మూడు వందల మందికి పైగా ఎన్నారైలు హాజరయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి ముప్పై రోజుల ప్రజాపాలన భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, జనరంజకమైన పాలనతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలొ ప్రయాణించాలని ఆకాంక్షించారు. మూడు నెలలలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది సోదరులు ఎనుముల జగదీశ్ రెడ్డితో పాటు, పోచంపల్లి తిరుపతిరెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి, బొందుగుల జగదీశ్ రెడ్డి, మాదవరం నాగేందర్, బువనేశ్ బుజాల, అమర్ బొజ్జా, ప్రొద్దుటూరి రమణారెడ్డి, రవి బొజ్జా, అజయ్ గంజి, శ్రవణ్ పాడూరి, విజయపాల్ పైళ్ళ, వేణు నక్షత్రం, శ్రీనివాస్ తాటిపాముల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 09:19 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising