Home » NRI Organizations
బోస్టన్‌లో TANA న్యూ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో ‘నందమూరి అందగాడు’ సంగీత కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతికూల వాతావరణం మధ్య 200 మందికి పైగా ప్రేక్షకులు హాజరుకాగా, మధురవాణి మ్యూజికల్ గ్రూప్ గాయకులు ఎన్టీఆర్ చిత్రాల పాటలతో అలరించారు.
ఆస్టిన్ పాఠశాల, విశ్వగురుకులం 2026-27 విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించాయి. ఈ ఏడాది ఆస్టిన్ తెలుగు కుటుంబాలు చూపించిన అపూర్వ స్పందన ప్రత్యేకంగా నిలిచింది.
నెబ్రాస్కాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా వనభోజనాలు ఆత్మీయ వాతావరణంలో సందడిగా సాగాయి. రోజువారీ బిజీ జీవితానికి కొంత విరామం ఇస్తూ కొత్త పరిచయాలకు, పాత స్నేహాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ వేడుక చక్కని అవకాశాన్ని కల్పించింది.
కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా) సంయుక్తంగా 2026 ఆగస్టు 9న జార్జియాలోని ఆల్ఫారెట్టాలో ఉన్న కెటి బాంక్వెట్స్‌లో ‘ఉపస్తంభ’ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి.
ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ‘నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం(ఆగస్టు 9వ తేదీన) పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్ ‘బైయర్స్ స్టేషన్ క్లబ్ హౌస్’లో అత్యంత వైభవంగా జరిగింది.
సేవా స్ఫూర్తి, మానవత్వానికి ప్రతీకగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(TAMA) సంయుక్తంగా, అమెరికన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(CGI), అట్లాంటా సహకారంతో కమ్యూనిటీ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైకింగ్-26’ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.
భారతీయులు, ఇండియన్-అమెరికన్లపై జరుగుతున్న జాత్యహంకార దాడులు, వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారని, అటువంటి వారు చేసే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.
లండన్ వేదికగా తెలుగు ఎన్నారైల క్రికెట్ పండుగ షురూ అయింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో 10 జట్లతో TPL 2026 17వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 16 వరకు సాగనున్న ఈ సమరంతో పాటు ఆరోగ్య స్పూర్తిని రగిలించే 'వన్ మిలియన్ అడుగుల ఛాలెంజ్' కూడా నిర్వహిస్తున్నారు.
సెయింట్ లూయిస్‌లో నివసించే ప్రవాస ఆంధ్రుల కోసం ఉచిత ఆహార సేకరణ చేపట్టింది తానా సౌత్ సెంట్రల్ విభాగం. అందులో భాగంగా సుమారు 200 కుటుంబాలకు సరిపోయే ఆహారాన్ని సేకరించి ఫుడ్ బ్యాంక్‌కు విరాళమందించింది.