TANA Food Collection: సెయింట్ లూయిస్ తానా ఆధ్వర్యంలో ఆహార సేకరణ
ABN , Publish Date - Dec 23 , 2025 | 08:54 AM
సెయింట్ లూయిస్‌లో నివసించే ప్రవాస ఆంధ్రుల కోసం ఉచిత ఆహార సేకరణ చేపట్టింది తానా సౌత్ సెంట్రల్ విభాగం. అందులో భాగంగా సుమారు 200 కుటుంబాలకు సరిపోయే ఆహారాన్ని సేకరించి ఫుడ్ బ్యాంక్‌కు విరాళమందించింది.
ఇంటర్నెట్ డెస్క్: తానా సౌత్ సెంట్రల్(TANA South Central) విభాగం ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్(St.Louis) ప్రవాసాంధ్రులు పేదలకు ఉచితంగా ఆహారం అందించేందుకు గానూ ఆహార పదార్థాలను సేకరించారు. నవంబర్ 22 నుంచి డిసెంబరు 15 మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 కుటుంబాలకు సరిపడా ఆహారాన్ని సేకరించి సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంకు(Food Bank)కు విరాళంగా అందజేసినట్లు తానా ఫౌండేషన్(Tana Foundation) ట్రస్టీ సూరపనేని రాజా(S Raja) తెలిపారు. ఈ కార్యక్రమానికి చేయూతనందించిన దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమ నిర్వహణకు తానా సౌత్ సెంట్రల్ ప్రాంతీయ ప్రతినిధి పొట్ల రవి, పాతూరి దామోదర్, గంగవరపు రజనీకాంత్, బొప్పన నాగేశ్వరరావు, డా.చదలవాడ కూర్మనాథ్, యర్రపోతిన కిశోర్, యార్లగడ్డ కిశోర్, నర్రా సుధాకర్, వీరవల్లి రామకృష్ణ, పాతిరి వంశీ, సాక్షి విజయ్, బుడ్డి విజయ్, సురేన్ బైరపనేని తదితరులు తమ వంతు సహకారం అందజేశారు.


ఇవీ చదవండి: