NRI : అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు
ABN , Publish Date - Jan 28 , 2025 | 07:49 PM
NRI : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు వందలాాది మంది హాజరయ్యారు.

వాష్టింగ్టన్: అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్‌లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనం నిర్వహించారు. జనవరి 26వ తేదీ ఆదివారం దేశంలోనే అతి పెద్దదైన జాతిపిత మహాత్మా గాంధీ స్మారక స్థలి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి వందలాది మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస భారతీయలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగంలోని అవతారిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు.. మొత్తం 251 పేజీలున్న భారత రాజ్యాంగం.. దేశ పరిపాలనకు సంబంధించిన ప్రామాణిక గ్రంథమని ఆయన అభివర్ణించారు. దీనిలో ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వ సంస్థల విధులతోపాటు పౌర హక్కులను సైతం వివరించారని ఈ సందర్భంగా డాక్టర్ తోటకూర ప్రసాద్ సోదాహరణగా విపులీకరించారు.
1950, జనవరి 26వ తేదీన భారత రాజ్యంగం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ రాజ్యాంగ రచన వెనుక ముసాయిదాను రూపొందించిన బ్రిటిష్ ప్రభుత్వంలో నాటి ఇండియన్ సివిల్ సర్వెంట్ సర్ బెనెగళ్ నర్సింగరావు (బి.ఎన్ రావు) కృషి, ముసాయిదా కమిటీకి చైర్మన్‌గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశేష సేవలందించారని చెప్పారు. అలాగే ఈ కమిటీలోని సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి, కే.ఎం మున్షి, మహ్మద్ సాదుల్లా, బీ.ఎల్ మిట్టల్, డీ.పీ ఖైతాన్‌లు అభినందనీయులని ఆయన పేర్కొన్నారు.
Also Read: జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం
Also Read: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం
ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు అభ్యర్ధన మేరకు ప్రముఖ చేతి రాత నిపుణుడు ‘ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా’ తన సొంత దస్తూరితో ఆరు నెలల పాటు శ్రమించి హిందీ, ఆంగ్ల భాషలలో వ్రాసిన మన భారత రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగమని డాక్టర్ ప్రసాద్ తోటకూర స్పష్టం చేశారు. రాజ్యాంగం అసలు ప్రతిని నేటికి పార్లమెంట్ గ్రంథాలయంలో అందరూ చూడవచ్చునన్నారు.
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
ఈ వేడుకలలో మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, కో చైర్మన్ తయాబ్ ఖండావాలా, రాజీవ్ కామత్, కార్యదర్శి రావు కల్వాల, బోర్డ్ సభ్యులు బి. ఎన్ రావు, మహేంద్ర రావు, అనంత్ మల్లవరపుతోపాటు ఐఎఎన్టీ నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులతోపాటు పిల్లలు,పెద్దలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకు ముందు ఈ కార్యక్రమానికి హాజరైన వారికి మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వారికి స్వాగతం పలికారు.
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..