Share News

NRI: ఏపీ అభివృద్ధికి నార్వే ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్‌ మద్దతు

ABN , Publish Date - Jun 10 , 2024 | 07:45 AM

ఆంధ్రప్రదేశ్(andhra pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే(NDA) కూటమి అద్భుత విజయం సాధించినందుకు ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్(AP Development Forum) నార్వే(Norway)లో సంబరాలు నిర్వహించింది. ఈ క్రమంలో అక్కడ పలువురు నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

NRI: ఏపీ అభివృద్ధికి నార్వే ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్‌ మద్దతు
Norway AP Development Forum

ఆంధ్రప్రదేశ్(andhra pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే(NDA) కూటమి అద్భుత విజయం సాధించినందుకు ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్(AP Development Forum) నార్వే(Norway)లో సంబరాలు నిర్వహించింది. ఈ క్రమంలో అక్కడ పలువురు నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నార్వే ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్‌ సపోర్ట్ చేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది శుభాకాంక్షలు తెలియజేశారు. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన(janasena) పార్టీలు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయగా.. ఫలితాల్లో రాష్ట్రంలోని 174 అసెంబ్లీ స్థానాలకు గానూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో జనసేన పార్టీ 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఐదేళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడు మరోసారి రాష్ట్రంలో సీఎంగా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


ఇది కూడా చదవండి:

NRI: టొరంటోలో టీసీఏ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ధూమ్ ధామ్ వేడుకలు

VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్‌ బైబై


అప్రమత్తతే మేలు !


Read Latest NRI News and Telugu News

Updated Date - Jun 10 , 2024 | 07:48 AM