ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gyanvapi: జ్ఞానవాపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Feb 14 , 2024 | 10:21 AM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ జ్ఞానవాపిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న ‘వ్యాస్ కా టెఖానా’లో మంగళవారం నాడు పూజ చేశారు.

వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ జ్ఞానవాపిలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న ‘వ్యాస్ కా టెఖానా’లో పూజలు చేశారు. మసీదు సీలు చేసిన నేలమాళిగలో పూజ చేయడానికి వారణాసి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) జ్ఞానవాపికి వచ్చారు. వ్యాస్ కా టెఖానాలో ప్రతిష్ఠించిన ప్రతిమలను చూసి యోగి ఆదిత్యనాథ్ ముచ్చట పడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన నందికి ప్రత్యేక పూజలు చేశారు.

తర్వాత వారణాసిలో డాక్టర్ సంపూర్ణానంద్ స్టోర్స్ స్టేడియం, కాశీ రోప్ వేను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో వారణాసిలో మోదీ పర్యటించాల్సి ఉంది. అంతకుముందు యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. మోదీ పర్యటన నేపథ్యంలో వారణాసి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయంలో యోగి ఆదిత్యనాథ్ పూజలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2024 | 10:21 AM

Advertising
Advertising