ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా స్పందన.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

ABN, Publish Date - Mar 27 , 2024 | 03:20 PM

కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించడంపై అమెరికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె బుధవారం సౌత్‌ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగగా.. ఆమె వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

లిక్కర్ స్కామ్‌కి (Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టుపై ఇటీవల అగ్రరాజ్యం అమెరికా (America) స్పందించిన విషయం తెలిసిందే. భారత్‌లోని ప్రతిపక్ష నేత (కేజ్రీవాల్) అరెస్టుకు సంబంధించిన నివేదికలను యునైటెడ్ స్టేట్స్ (United States) ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని.. ఈ కేసులో సమయానుకూల, పారదర్శక న్యాయ విచారణను ప్రోత్సాహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మంగళవారం చెప్పుకొచ్చారు. తాజాగా దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత విషయాల్లో ఇలా జోక్యం చేసుకోవడం తగదని మండిపడింది.

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా రియాక్షన్.. ఏం చెప్పిందో తెలుసా?

కేజ్రీవాల్ అరెస్టుపై (Kejriwal Arrest) అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించడంపై అమెరికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనాకు (Gloria Berbena) సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె బుధవారం సౌత్‌ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగగా.. ఆమె వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ‘‘దౌత్య సంబంధాల్లో భాగంగా.. దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని మేం భావిస్తున్నాం. మరీ ముఖ్యంగా.. తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. లేదంటే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది’’ అని అమెరికాకు భారత్ స్పష్టంగా చెప్పింది. అంతేకాదు.. భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయని.. ఇందులో కచ్చితమైన, సమయానుకూల ఫలితాలు వస్తాయి.. దీనిపై అంచనాలు వేయడం సరికాదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.


IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ.1 కోటి ఢమాల్.. భర్త చేసిన పనికి పాపం భార్య!

అంతకుముందు జర్మనీ (Germany) సైతం కేజ్రీవాల్ అరెస్టుపై ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులని ఆ దేశం పేర్కొంది. అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా కేజ్రీవాల్ వినియోగించుకోవచ్చని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ అంశంపై కూడా భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసి.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటని నిప్పులు చెరిగింది. ఆ వ్యాఖ్యలు భారత న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫైర్ అయ్యింది.

Updated Date - Mar 27 , 2024 | 03:22 PM

Advertising
Advertising