Share News

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా రియాక్షన్.. ఏం చెప్పిందో తెలుసా?

ABN , Publish Date - Mar 26 , 2024 | 09:45 PM

దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సాహిస్తున్నామని పేర్కొంది.

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా రియాక్షన్.. ఏం చెప్పిందో తెలుసా?

దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌పై తాజాగా అగ్రరాజ్యం అమెరికా (America) స్పందించింది. కేజ్రీవాల్ అరెస్టుకు (Kejriwal Arrest) సంబంధించిన నివేదికలను యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సాహిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. ‘‘ఈ కేసులో సమయానుకూల, పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని కేజ్రీవాల్ అరెస్ట్‌పై అడిగిన ప్రశ్నకు గాను ఆయన బదులిచ్చారు. అయితే.. దీనిపై భారత ప్రభుత్వం గానీ, ప్రధాని మోదీ (PM Modi) గానీ ఇంతవరకు స్పందించలేదు.

Phone Tapping case: ప్రణీత్ రావుని కస్టడీకి ఇవ్వండి.. నాంపల్లి కోర్టులో పిటిషన్


కొన్ని రోజుల క్రితం కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమని.. ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇతర భారతీయ పౌరుల తరహాలోనే కేజ్రీవాల్ కూడా న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణను అర్హులని అన్నారు. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసులో వర్తిస్తాయని తాము భావిస్తున్నామని చెప్పారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ దేశ రాయబారికి పిలిపించి.. ఆయన వద్ద భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటని మండిపడింది. ఆయన వ్యాఖ్యలు భారత న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Virat Kohli: టీ20 గేమ్ ప్రమోషన్‌కు నా పేరే వాడుతున్నారు.. వారికి కోహ్లీ సూపర్ అన్సర్

మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) మార్చి 21వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ ఢిల్లీలో తీవ్ర నిరసనలకు దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీతో (Aam Admi Party) పాటు కాంగ్రెస్ (Congress), ఇతర మిత్రపక్షాలు ఆయన అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎన్నికల ముందు ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు ఈడీ లాంటి ఏజెన్సీలను బీజేపీ (BJP) వినియోగించుకుంటోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. బీజేపీ ఈ వాదనల్ని ఖండిస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్‌తో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని పేర్కొంటోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 26 , 2024 | 09:45 PM