Share News

IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ.1 కోటి ఢమాల్.. భర్త చేసిన పనికి పాపం భార్య!

ABN , Publish Date - Mar 26 , 2024 | 05:45 PM

క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఎన్నో జీవితాలు సర్వనాశనం అయ్యాయి. దీనికి బానిసైన వారిలో చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయి, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలోనూ దాదాపు ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. ఐపీఎల్ బెట్టింగ్‌కు బానిసై భర్త చేసిన అప్పుల కారణంగా.. ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది.

IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ.1 కోటి ఢమాల్.. భర్త చేసిన పనికి పాపం భార్య!

క్రికెట్ బెట్టింగ్ (Cricket Betting) కారణంగా ఎన్నో జీవితాలు సర్వనాశనం అయ్యాయి. దీనికి బానిసైన వారిలో చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయి, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలోనూ (Karnataka) దాదాపు ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. ఐపీఎల్ బెట్టింగ్‌కు (IPL Betting) బానిసై భర్త చేసిన అప్పుల కారణంగా.. ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

US Bridge Collapse: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జ్

బెంగళూరుకి (Bengaluru) చెందిన దర్శన్ బాబు (Darshan Babu) అనే ఓ వ్యక్తి హొసదుర్గలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతనికి 2020లో రంజిత (23) అనే యువతితో వివాహం అయ్యింది. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ.. 2021లో దర్శన్ ఎప్పటి నుంచైతే ఐపీఎల్ గేమ్‌లపై (IPL Games) బెట్టింగ్ వేయడం స్టార్ట్ చేశాడో, అప్పటి నుంచి వీరి కాపురంలో చిచ్చు రేగింది. అతడు 2021 - 2023 మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లపై భారీ బెట్టింగ్స్ వేశాడు. అయితే.. అతడు ప్రతిసారి ఓడిపోవడంతో భారీ మొత్తంలో అప్పు చేయాల్సి వచ్చింది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. దర్శన్ రూ.1.5 కోట్లకు పైగా అప్పు చేశాడు.


మొదట్లో దర్శన్ కొన్ని పందేల్లో గెలవడంతో, రెగ్యులర్‌గా బెట్టింగ్ వేయడం ప్రారంభించాడు. తాను భారీ మొత్తంలో ఓడిపోయినా.. ఈసారి తప్పకుండా అదృష్టం తలుపు తడుతుందన్న నమ్మకంతో, అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ వేశాడు. కానీ.. దురదృష్టవశాత్తూ అతడు క్రమంగా ఓడిపోతూ వచ్చాడు. దీంతో కోటిన్నరకు పైగా అప్పులు చేయాల్సి వచ్చింది. అందులో రూ.1 కోటి వరకు అప్పు తీర్చగలిగాడు కానీ.. ఇంకా రూ.84 లక్షల అప్పు మిగిలి ఉందని పోలీసులు తెలిపారు. ఆ వడ్డీ వ్యాపారులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని తరచూ వేధింపులకు గురి చేశారని, అది తట్టుకోలేక రంజిత ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి వెంకటేశ్ తెలిపారు.


MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించిన అధికారులు

తన కూతురు రంజిత సూసైడ్‌కు వడ్డీ వ్యాపారులే కారణమని 13 మంది (అప్పు ఇచ్చిన వారు) వ్యక్తులతో వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి.. దర్శన్‌కి బెట్టింగ్ అంటే ఇష్టం లేదని, కానీ కొందరు ధనవంతులు అవ్వాలన్న ఉద్దేశంతో దర్శన్ చేత బలవంతంగా బెట్టింగ్స్ వేయించారని ఆయన ఆరోపించారు. సెక్యూరిటీగా బ్యాంక్ చెక్స్ కూడా ఇస్తామని వాళ్లు హామీ ఇచ్చారని అన్నారు. మరోవైపు.. రంజిత ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా వారికి ఓ సూసైట్ నోట్ దొరికింది. అందులో తాను ఎదుర్కున్న ఇబ్బందుల్ని రంజిత వివరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 26 , 2024 | 05:48 PM