Share News

US Bridge Collapse: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జ్

ABN , Publish Date - Mar 26 , 2024 | 04:45 PM

అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఓడ ఢీకొని ఏకంగా ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో ప్రకారం.. వాహనాలను మోసుకెళ్తున్న ఒక కంటైనర్ షిప్ ‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్’ పిల్లర్‌ని ఢీకొనగానే.. అది పేకమేడలా కూలింది.

US Bridge Collapse: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జ్

అమెరికాలోని (America) బాల్టిమోర్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఓడ ఢీకొని ఏకంగా ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో ప్రకారం.. వాహనాలను మోసుకెళ్తున్న ఒక కంటైనర్ షిప్ ‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్’ (Francis Scott Key Bridge) పిల్లర్‌ని ఢీకొనగానే.. అది పేకమేడలా కూలింది. ఈ సందర్భంగా.. చిన్న చిన్న పేలుళ్లు కూడా సంభవించాయి. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై ఉన్న వాహనాలు నదిలో పడిపోగా.. దాదాపు 20 మంది గల్లంతయ్యారని సమాచారం.

India Maldives Row: ముయిజ్జు.. మొండితనం మానేసి, సంబంధాల్ని సరిదిద్దుకోండి


ఈ ఘటనపై అగ్నిమాపక విభాగానికి చెందిన కెవిన్ కార్ట్‌రైట్ మాట్లాడుతూ.. వంతెన కూలిపోవడంతో దానిపై ఉన్న కొన్ని వాహనాలు నదిలో పడిపోయాయని, కొందరు వ్యక్తులు కూడా గల్లంతయ్యారని, కాబట్టి చాలామంది చనిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయన్నారు. అయితే.. నదిలో కొన్ని కంటైనర్లు అస్థిరంగా ఉండటంతో, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని నివేదికలు సూచించాయి. కాగా.. 2.6 కిలోమీటర్ల పొడవు గల ఈ నాలుగు లేన్ల వంతెన పటాప్‌స్కో నదిపై (Patapsco River) నిర్మించారు. దీనిని 1977లో ప్రారంభించారు. రోజుకు 31వేలు చొప్పున.. ఏడాదికి 11 మిలియన్ల కంటే ఎక్కువ వాహనాలు దీనిపై ప్రయాణిస్తాయి. ఇది బాల్టిమోర్ చుట్టూ ఉన్న రహదారి నెట్‌వర్క్‌లో ఓ ప్రధాన భాగం. ఇప్పుడిది కూలిపోవడంతో.. పెద్ద దెబ్బ తగిలినట్లయ్యింది.

Kejriwal: జైలు నుంచే జోరు.. రెండో ఆర్డర్స్ జారీ చేసిన కేజ్రీవాల్..

ఇదిలావుండగా.. గత నెలలో చైనాలోనూ (China) ఇదే తరహా ఘటన జరిగింది. గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై నిర్మించిన లిజింగ్షా వంతెనను ఒక షిప్ బలంగా డీకొంది. దీంతో.. ఒక బస్సుతో పాటు ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురి ఆచూకీ గల్లంతయ్యింది. అదృష్టవశాత్తూ.. నదిలో పడిన బస్సులో ప్రయాణికులు లేకపోవడం, కేవలం డ్రైవర్ మాత్రమే ఉండటంతో భారీ ప్రమాదం తప్పినట్టయ్యింది. అయితే.. బాల్టిమోర్ బ్రిడ్జ్ (Baltimore Bridge) ప్రమాదంలో మాత్రం చాలామంది గల్లంతవ్వడంతో, ప్రాణనష్టం అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 26 , 2024 | 04:59 PM