ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Uttar Pradesh: గొంతునులిమి చిన్నారి హత్య.. మృతదేహాన్ని పీక్కుతిన్న అడవి జంతువులు..

ABN, Publish Date - Feb 11 , 2024 | 11:31 AM

వీధిలో ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకెళ్లిన ఓ వ్యక్తి.. మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి పాశవికంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోగా..

వీధిలో ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకెళ్లిన ఓ వ్యక్తి.. మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి పాశవికంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోగా.. ఆ డెడ్ బాడీని అడవి జంతువులు పీక్కు తిన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని కౌడియాగంజ్ లో గుల్షర్ కుటుంబం నివాసముంటోంది. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. తన ఆరేళ్ల కుమారుడు ముద్దాసిర్ సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. అయితే ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల అంతా వెతికారు. తెలిసిన వారందరినీ ఆరా తీశారు. అయినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కింటి వారిపై అనుమానం ఉందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పక్కింటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా మద్యం మత్తులో తానే ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. వీధిలో నుంచి బాలుడిని ఎత్తుకెళ్లి అడవిలో తీసుకెళ్లానని, అక్కడే గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని పక్కనే ఉన్న పంట పొలంలో పడేసి వెళ్లిపోయినట్లు వివరించాడు. నిందితుడు ఇచ్చిన ఆనవాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు.


మృతదేహాన్ని పడేసిన ప్రదేశంలో బాలుడి శరీర భాగాలు ఛిద్రమైపోయాయి. వాటిని పరిశీలించగా అడవి జంతువులు తిని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. శవ పరీక్షల కోసం శరీర భాగాలను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 11:31 AM

Advertising
Advertising