ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Salman Khan house firing: తపతీ నదిలో రెండు పిస్తోళ్లు, 13 బుల్లెట్లు స్వాధీనం

ABN, Publish Date - Apr 23 , 2024 | 08:41 PM

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పుల ఘటనలో ఇద్దరు షూటర్లు ఉపయోగించిన ఆయుధాలను, తూటాలను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని తపతీ నదిలో వీటిని కనుగొని, వెలికి తీసినట్టు పోలీసులు మంగళవారంనాడు తెలిపారు.

అహ్మదాబాద్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పుల ఘటనలో (Salman Khan house firing) ఇద్దరు షూటర్లు ఉపయోగించిన ఆయుధాలను, తూటాలను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని తపతీ (Tapi) నదిలో వీటిని కనుగొని, వెలికి తీసినట్టు పోలీసులు మంగళవారంనాడు తెలిపారు. వీటిలో రెండు తుపాకులు, 13 బుల్లెట్లు, మూడు మ్యాగజైన్లు ఉన్నాయి.


సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పుల అనంతరం భుజ్‌కు పారిపోతూ రైల్వే బ్రిడ్జి నుంచి నదిలోకి ఆయుధాలు పారేసినట్టు పట్టుబడిన షూటర్లు సాగర్ పాల్, విక్కీ గుప్తా పోలీసు ఇంటరాగేషన్‌లో వెల్లడించారు. ఈ సమాచారంతో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దయా నాయక్ సహా 12 మంది అధికారుల బృందం తపసీ నదిలో గాలింపు చర్యలు చేపట్టింది.

Lok Sabha Elections: అభిషేక్‌ను కాల్చి చంపేసే వాళ్లు.. మమత సంచలన ఆరోపణ


భయపెట్టేందుకే...

సల్మాన్ ఖాన్ నివాసముంటుంన్న ముంబై బాంద్రా ప్రాంతంలోని గాలక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఏప్రిల్ 14న కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. మోటారుసైకిల్‌పై వచ్చిన ఇద్దరు షూటర్లు ఐదు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కేసులో నిందితులిద్దరిని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారు. కాగా, తాము తొలుత పాన్వెల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌ వద్ద రెక్కీ నిర్వహించినట్టు విచారణలో నిందితులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. సల్మాన్‌ను భయపెట్టేందుకే కాల్పులు జరిపామని, హత్య చేసే ఉద్దేశం లేదని నిందితులు వెల్లడించారని కూడా చెబుతున్నారు. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్ అకౌంట్‌లో అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఈ కాల్పులకు తామే బాధ్యులమని ప్రకటించడం సంచలనం సృష్టించింది. కాల్పుల ఘటనకు 3 గంటల ముందు ఈ అకౌంట్ క్రియేట్ చేసినట్టు తెలుస్తున్నది.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 08:42 PM

Advertising
Advertising