ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Priya Dutt: కాంగ్రెస్‌కు రాజీనామా వార్తలపై ప్రియాదత్ స్పందనిదే..

ABN, Publish Date - Apr 05 , 2024 | 08:58 PM

దివంగత నటుడు, కాంగ్రెస్ నేత సునీల్ దత్ కుమార్తె, సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారా? ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరనున్నారా? దీనిపై వస్తున్న ఊహాగానాలకు ప్రియాదత్ శుక్రవారంనాడు తెరదించారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని, చేసే ఆలోచన కూడా లేదని తెలిపారు.

ముంబై: దివంగత నటుడు, కాంగ్రెస్ నేత సునీల్ దత్ (Sunil Dutt) కుమార్తె, సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ (Priya Dutt) కాంగ్రెస్ (Congress) పార్టీకి రాజీనామా చేశారా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరనున్నారా? దీనిపై వస్తున్న ఊహాగానాలకు ప్రియాదత్ శుక్రవారంనాడు తెరదించారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని, చేసే ఆలోచన కూడా లేదని తెలిపారు. కాకుంటే, తాను ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నానని చెప్పారు.


అప్పుడు కూడా అంతే కానీ..

2019 ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయాలని అనుకోలేదని, అయితే ఈ విషయాన్ని తాను ఆలస్యంగా పార్టీకి తెలియజేసినట్టు ప్రియాదత్ వివరించారు. దాంతో తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత మాత్రం ముందుగానే తాను ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. కొద్దికాలంగా జ్యోతిరాదిత్య సింధియా, మిలంద్ డియోరా వంటి సీనియర్ యువనేతలు కాంగ్రెస్ పార్టీని వీడటంపై అడిగినప్పుడు, గతంలో యువనేతలను కాంగ్రెస్ ప్రోత్సహించినప్పటికీ ఇటీవల కాలంలో పార్టీలో యువనాయకులకు ప్రోత్సాహం తగ్గిందని ఆమె అభిప్రాయపడ్డారు.

Lok Sabha Elections: ఇది సైద్ధాంతిక పోరాటం, ఎన్నికల తర్వాతే పీఎం అభ్యర్థి ఎంపిక: రాహుల్


మోదీ ప్రభుత్వం పనితీరుపై..

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పనులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా త్వరిగతిన పూర్తి చేసిందని ప్రియాదత్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందువల్ల క్రెడిట్ రెండు ప్రభుత్వాలకు దక్కుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై ఎవరూ జోస్యం చెప్పలేరని, ఓటర్లను గౌరవించి, వారిపై విశ్వాసం ఉంచాలని అన్నారు.

Congress: ప్రతి మహిళకు ఏడాదికి రూ.లక్ష.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వరాలు..


ప్రియాదత్ ఎన్నికల నేపథ్యం

2019 లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రియాదత్ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి పూనం మహాజన్ చేతిలో ఓటమి చవిచూశారు. 2014లోనూ ఇదే నియోజకవర్గంలో మహాజన్ ఆమెను ఓడించారు. అయితే, 2009లో మాత్రం బీజేపీ అభ్యర్థి మహేష్ జెఠ్మలానీపై ప్రియాదత్ గెలుపొందారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీ ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 05 , 2024 | 08:58 PM

Advertising
Advertising