PM Modi: వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ABN, Publish Date - Jan 18 , 2024 | 09:08 AM
వికసిత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ప్రధాని మోదీ ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ప్రధాని మోదీ (PM Modi) ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. వికసిత్ సంకల్ప్ యాత్ర గత ఏడాది నవంబర్ 15వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వికసిత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ప్రధాని మోదీ (PM Modi) ఐదుసార్లు వర్చువల్‌గా మాట్లాడారు. 2023 నవంబర్ 30, డిసెంబర్ 9, డిసెంబర్ 16, డిసెంబర్ 27, 2024 జనవరి 8వ తేదీన వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. డిసెంబర్ 17, 18వ తేదీల్లో వారణాసిలో ప్రత్యక్షంగా లబ్దిదారులను ప్రధాని మోదీ కలిసి, మాట్లాడారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో సభ్యుల సంఖ్య 15 కోట్లకు చేరింది.
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సమాజంలోని అందరికీ అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 18 , 2024 | 09:08 AM