ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Polls: విష సర్పాన్ని నమ్మొచ్చు బీజేపీని విశ్వసించలేం.. దీదీ నిప్పులు

ABN, Publish Date - Apr 04 , 2024 | 09:42 PM

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీ అధినేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌ కూచ్ బెహర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా విమర్శలు చేశారు. అందుకు దీదీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

కోల్ కతా: లోక్ సభ ఎన్నికల (Loksabha Polls) ప్రచారంలో ప్రధాన పార్టీ అధినేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పశ్చిమ బెంగాల్‌ కూచ్ బెహర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా విమర్శలు చేశారు. అందుకు దీదీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మమతా బెనర్జీ కూడా కూచ్ బెహర్‌లో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు.


లోక్ సభ ఎన్నికల బీజేపీ ఎన్నికల నిబంధనలను పాటించడం లేదని మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్‌ను తమ పావుగా బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. ఇదే అంశంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆవాస్ యోజన పథకంలో తమ పేర్లను నమదు చేసుకోవాలని బీజేపీ కోరుతుంది. ఇప్పటికే అర్హులు ఎంటర్ చేశారని మమత గుర్తుచేశారు. ఇప్పుడు నమోదు చేస్తే కచ్చితంగా కొన్ని పేర్లును తొలగిస్తారు. మీరు విషపూరితమైన పామును నమ్మొచ్చు. ఆ పామును పెంచొచ్చు.. కానీ బీజేపీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దేశాన్ని బీజేపీ నాశనం చేస్తుందని దీదీ దుమ్మెత్తి పోశారు.


బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కూచ్ బెహర్‌లో స్థానికులను బీఎస్ఎఫ్ సిబ్బంది ఇబ్బందికి గురిచేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మమతా బెనర్జీ కోరారు.


ఇవి కూడా చదవండి:

Borewell: 20 గంటల తర్వాత సురక్షితంగా బయటకు రెండేళ్ల బాలుడు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ ఆ పిటిషన్ తిరస్కరణ

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 04 , 2024 | 09:44 PM

Advertising
Advertising